అల్లు అర్జున్ కి పుష్ప సినిమా( Pushpa Movie ) లో అద్భుత నటన ప్రదర్శించినందుకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.తాజాగా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా అల్లు అర్జున్ జాతీయ అవార్డును అందుకున్నాడు.
ఈ వేడుక ఫోటోలు మరియు వీడియో లు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.అల్లు అర్జున్ అభిమానులు పుష్ప రాజ్ ను తెగ వైరల్ చేస్తున్నారు.
అయితే ఇతర హీరోల అభిమానులు మాత్రం బన్నీ విజయాన్ని… దక్కిన గౌరవాన్ని గురించి పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు.అల్లు అర్జున్ హీరోగా మొదటి సారి జాతీయ అవార్డు( Allu Arjun National Award )ను సొంతం చేసుకున్నాడు.
టాలీవుడ్( Tollywood ) లో అల్లు అర్జున్ కి దక్కిన మొదటి గౌరవం ఇది.అందుకే ఇది చాలా ప్రత్యేకం.ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఏ ఒక్కరు కడా జాతీయ అవార్డును సొంతం చేసుకోలేదు.బన్నీ కి మొదటి విజయం దక్కడం తో చాలా మంది ఆయన అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆయనకు కచ్చితంగా సన్మానం చేయాలని కోరుకుంటున్నారు.
అల్లు అర్జున్( Allu Arjun ) ఒక గొప్ప విషయాన్ని సొంతం చేసుకున్నాడు.అంతే కాకుండా తెలుగు వారు గర్వించే విధంగా చేశాడు.కనుక కచ్చితంగా ఇండస్ట్రీ నుంచి ఆయనకు సన్మానం అందాల్సిందే అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అల్లు అర్జున్ కి దక్కిన గౌరవం ను మరింత పెంచే విధంగా సన్మానం చేస్తే బాగుంటుంది అంటున్నారు.గతంలో పద్మ అవార్డులను( Padma Awards ) దక్కించుకున్న వారిని ఇండస్ట్రీ తరపున సన్మానించిన దాఖలాలు ఉన్నాయి.కనుక ఈసారి కూడా బన్నీకి అలాంటి సన్మానం జరగాల్సిన అవసరం ఉంది అనేది చాలా మంది అభిప్రాయం.
అల్లు అర్జున్ పుష్ప 2( Pushpa 2 ) తో కూడా జాతీయ అవార్డును సొంతం చేసుకుంటాడని అభిమానులు నమ్ముతున్నారు.