బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amithab Bacchan) తాజాగా తన 81 పుట్టినరోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు .అయితే ఈయన పుట్టినరోజు చాలామంది సెలబ్రిటీలు, అభిమానులు ప్రతి ఒక్కరు ఆయనకు స్పెషల్ గా విష్ చేశారు.
అయితే అమితాబచ్చన్ బర్త్డే విషయంలో ఒకరోజు ఆలస్యంగా అమితాబచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) బర్త్డే విషెస్ తెలిపింది.అయితే ఈమె తన సోషల్ మీడియా ఖాతాలో అమితాబ్ బచ్చన్ తనకూతురు ఆరాధ్య తో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ మీరు ఎప్పటికీ ఇలాగే భగవంతుడి ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అని కోరుకుంది.
అయితే ఈమె చేసిన పోస్ట్ బాగానే ఉంది.కానీ ఇందులో ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
అదేంటంటే ఐశ్వర్యా రాయ్ షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేసి పెట్టింది.ఇక ఆ అసలు ఫోటోలో అమితాబ్ బచ్చన్ మనవరాలు ఆరాధ్య (Aaradhya) తో పాటు తన భార్య జయా బచ్చన్ అలాగే తన ఆడపడుచు పిల్లలతో కలిసి ఉన్న ఫోటో ఉంది.అయితే ఈ ఫోటో నుండి వీరందరినీ ఎడిట్ చేసి కేవలం అమితాబ్ బచ్చన్ అలాగే ఆరాధ్య ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు మాత్రమే క్రాప్ చేసి పోస్ట్ చేసింది.అయితే ఐశ్వర్యరాయ్ పెట్టిన ఈ పోస్టులో అంత ఆశ్చర్యం ఏమీ లేకపోయినప్పటికీ కొంతమంది కావాలనే ఈ పోస్టుని వైరల్ చేస్తూ ఇందులో ఏదో అనుమానపడే విషయం ఉంది అంటూ తెరమీద కొత్త ప్రచారం చేస్తున్నారు.
ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళపై ఇలాంటి ప్రచారాలు కొత్తేమీ కాదు.అయితే రీసెంట్ గా ప్యారిస్ లో ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్నారు ఐశ్వర్యారాయ్, జయ బచ్చన్(Jaya Bacchan) ,ఐశ్వర్య ఆడపడుచు శ్వేతా బచ్చన్ అలాగే ఆమె కూతురు నవ్య.( Navya ) అయితే ఇందులో ఐశ్వర్యరాయ్ తో పాటు శ్వేతా కూతురు నవ్య నవేలి కూడా ర్యాంప్ వాక్ చేసింది.అయితే ఈ ర్యాంప్ వాక్ చేసే సమయంలో నవ్య ని ఎంకరేజ్ చేసిన జయ బచ్చన్, శ్వేతాలు ఐశ్వర్యారాయ్ వస్తే మాత్రం అంతగా పట్టించుకోలేదట.
అయితే ఈ విషయంలో కోపం పెట్టుకున్న ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) కావాలనే వీరి ఫోటోలు ఎడిట్ చేసి తన కూతురు మామయ్య ఫోటోలు మాత్రమే పెట్టుకుంది అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కానీ చాలామంది నెటిజన్స్ మాత్రం ప్రతిసారి ఐశ్వర్యరాయ్ తన కూతురు మామ కలిసి ఉన్న ఫోటోలు మాత్రమే బర్త్డే రోజు పెడుతుంది.ఇందులో అనుమానించదగిన విషయం ఏమీ లేదు అని కొట్టి పారేస్తున్నారు
.