నందమూరి బాలకృష్ణ ( Balakrishna )హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షో సీజన్ 3 మొదలు అయింది.ఇప్పటికే మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ను నిర్వహించారు.
బాలకృష్ణ తాజా చిత్రం భగవంత్ కేసరి సినిమా యొక్క యూనిట్ సభ్యులతో అన్స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ ను ప్లాన్ చేశారు.గత సీజన్ లలో బాలయ్య రాజకీయ కోణం లో షో ను తీసుకు వెళ్లారు అంటూ విమర్శలు వచ్చాయి.
ఆహా టీమ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన వారు ఉన్నారు.రాజకీయంగా ఏదైనా షో పెడితే బాగుంటుంది.
అంతే తప్ప అన్ స్టాపబుల్ షో ను పొలిటికల్ షో గా మార్చడం ను ఏ ఒక్కరు సహించడం లేదు.
ఈ నేపథ్యం లో మూడో సీజన్ విషయం లో అలా జరగకుండా ఆహా టీం జాగ్రత్త లు తీసుకుంటుంది.రాబోయేది ఎన్నికల సీజన్.కనుక రాజకీయంగా ఎలాంటి ఎపిసోడ్ లు చేసినా కూడా కచ్చితంగా ప్రభావం ఉంటుంది.
అందుకే బాలయ్య తో ఎలాంటి పొలిటికల్ ఎపిసోడ్స్ లేకుండా మొత్తం సినిమా వాళ్లతోనే ఎపిసోడ్స్ ను చేయాలని నిర్ణయించుకున్నారు.ఇప్పటికే మొత్తం 13 ఎపిసోడ్స్ కి గాను గెస్ట్ లు ఓకే అయ్యారు.
వారితో చర్చలు కూడా పూర్తి అయ్యాయి.ఒక్కరు ఇద్దరు అటు ఇటు అయినా కూడా మొత్తంగా అనుకున్న వారే అన్ స్టాపబుల్ షో కి రాబోతున్నారు.ఆ మొత్తం 13 మంది గెస్ట్ ల్లో బాలయ్య సూచించిన వారు కొందరు కాగా కొందరు ఆహా టీం( Aha ott ) ఎంపిక చేసింది.అందులో హీరోయిన్స్, కమెడియన్స్ కూడా ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి.
ఒక ప్రముఖ నిర్మాతను కూడా ఈ సీజన్ లో గెస్ట్ గా తీసుకు రాబోతున్నారు.మొత్తానికి ఈసారి అన్ స్టాపబుల్ లో పొలిటికల్ డ్రామా లేకపోవడం మంచిదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.