ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా కొనసాగుతోంది.రెండు రోజుల పర్యటనలో భాగంగా హస్తినకు వెళ్లిన సీఎం జగన్ ఇప్పటికే కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు.
అదేవిధంగా ఇవాళ విజ్ఞాన్ భవన్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాదంపై జరిగే సమీక్షా సమావేశంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.దేశంలోని పలు ప్రాంతాల్లో మావోయిస్ట్ కార్యకలాపాలు, నివారణతో పాటు ఆ ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధిపై ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది.
అనంతరం అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది.రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులతో పాటు పెండింగ్ బకాయిలపై చర్చించనున్నారని తెలుస్తోంది.