Rathika Rose : ఏంటి! రతిక బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనుందా.. ఇందులో నిజమెంత?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 Telugu ) ట్విస్టులు కొట్లాటలు, గొడవలతో రసవత్తరంగా సాగుతోంది.ఇప్పటికే బిగ్ బాస్ షో 4 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

 Will Rathika Rose Re Entry In Bigg Boss House-TeluguStop.com

ప్రస్తుతం ఐదవ వారం కొనసాగుతోంది.ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి నలుగురు లేడీ కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

కిర‌ణ్ రాథోడ్‌, ష‌కిలా, దామిని, ర‌తిక‌లు ఎమిలినేట్ అయ్యారు.అయితే ప్ర‌స్తుతం హౌస్‌లో 10 మంది కంటెస్టెంట్లు మాత్ర‌మే ఉన్నారు.

వ‌రుస‌గా న‌లుగురు మ‌హిళా కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావ‌డం తెలుగు బిగ్‌బాస్ చ‌రిత్ర‌లో ఇదే మొద‌టి సారి.

Telugu Bigg Boss, Nagarjuna, Rathika Rose, Maa, Wild-Movie

వీరిలో ర‌తిక రోజ్( Rathika Rose ) ఎలిమినేష‌న్ చాలా మందికి షాకింగ్ గురి చేసింది.అంతేకాకుండా ర‌తిక ఎలిమినేషన్ పై ఇప్పటికీ ఆమె అభిమానులు బిగ్ బాస్ షోపై మండి పడుతూనే ఉన్నారు.ఇది ఫేక్ ఎలిమినేషన్ కావాలనే ఎలిమినేట్ చేశారు అంటూ బిగ్ బాస్ షో పై మండిపడుతున్నారు.

అయితే రతిక ఇచ్చిన తర్వాత ఆమె టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లలో ఒకరిగా ఉంటుందని చాలా మంది భావించారు.కానీ ఊహించని విధంగా నాలుగో వారం ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు.

అయితే ఆమె రైతు బిడ్డ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌( Pallavi Prashanth )తో వ్య‌వ‌హరించిన తీరు విమ‌ర్శ‌ల పాలు కావ‌డంతో ఆమెకు ప్రేక్ష‌కులు ఓట్లు వేయ‌న‌ట్లుగా తెలుస్తోంది.ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఒక వార్త వైర‌ల్‌గా మారింది.

బిగ్‌బాస్ హౌస్‌లోకి ర‌తిక రీ ఎంట్రీ( Rathika Rose Re Entry ) ఇస్తుంద‌నే టాక్ న‌డుస్తోంది.

Telugu Bigg Boss, Nagarjuna, Rathika Rose, Maa, Wild-Movie

అయితే ఈ సీజ‌న్ ఉల్టా ఫ‌ల్టాగా ఉంటుంద‌ని సీజ‌న్ ఆరంభంలోనే చెప్పేశారు.ఈ క్ర‌మంలో వ‌చ్చే వారంలో వైల్డ్ కార్డు( Bigg Boss Wild Card Entry ) ద్వారా మ‌రో ఆరు లేదా ఏడుగురు కంటెస్టెంట‌ర్ల‌ను హౌస్‌లోకి పంపించ‌నున్నార‌ట‌.ఇది మినీ లాంచింగ్ ఈవెంట్ లాంటిదేన‌ని అంటున్నారు.

అక్టోబర్ 8 ఆదివారం ఈ లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుంద‌ని చెబుతున్నారు.వీరిలో ర‌తిక కూడా ఉంటుంద‌ని అంటున్నారు.

బిగ్‌బాస్ రెండ‌వ సీజ‌న్‌లో నూత‌న్ నాయుడు రీ ఎంట్రీ ఇచ్చినట్లుగా ఈ సారి ర‌తిక‌ను కూడా హౌస్‌లోప‌లికి పంపాల‌ని ఆమె ఫ్యాన్స్ విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ర‌తిక నిజంగానే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube