ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సిద్ధార్థ్( Hero Siddharth ) హీరోగా వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి.ఇక అందులో భాగంగానే నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి సినిమాలు వరుస మంచి భారీ విజయాలను అందుకున్నాయి.
ఇక ఈ సినిమాలతో సిద్ధార్థ్ తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాపులు ఇప్పటికీ సిద్దార్థ్ కి ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు వచ్చింది.
ఇక ఆ తర్వాత వరుస పల్పులు రావడం సిద్ధార్థ్ ఒకే టైప్ ఆఫ్ స్టోరీస్ చేయడం లాంటివి చేయడం అలాగే ఆయన చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ ఉండడంతో వరుస ప్లాపులు( Flop Movies ) ఒకేసారి రావడంతో హీరోగా ఆయనకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.దాంతో ఆయన తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయాడు.
అక్కడ కొన్ని సినిమాలు తెలుగులో డబ్ చేశాడు అయినా కూడా ఆయనకు పెద్దగా విజయాలనేవి దక్కలేదు.దాంతో ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలు చేస్తున్నాడు తమిళంలో సినిమాలు చేస్తూ వాటిని తెలుగులోకి డబ్ చేస్తున్నాడు. చీత( Chithha ) అనే ఒక సినిమా కోసం ఆయన విపరీతంగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు.మొన్న బెంగళూరులో జరిగిన ఒక ప్రమోషన్ లో భాగంగా ఒక రాజకీయ పార్టీ నుంచి కొంతవరకు ఆయనకి అవమానం జరిగిందనే చెప్పాలి
ఎందుకు అంటే ప్రెస్ మీట్ నడుస్తున్న మధ్యలో వాళ్లు వచ్చి ఏదో ఇష్యూ జరుగుతూ ఉండటం వల్ల మధ్యలో వాళ్లొచ్చి వెళ్ళిపోమని చెప్పడం సంస్కారం కాదు,అయిన కూడా సిద్దు దాన్ని స్వీకరించాడు అలా సిద్దు కి అవమానం కూడా జరిగింది,అయిన కూడా వీటన్నింటిని అధిగమిస్తూ ప్రస్తుతం ఒక సినిమా హిట్టు కొట్టడానికి ఆరాట పడుతున్నాడు అందుకే ఏ విషయం జరిగిన కూడా కామ్ గా ఉంటూ ఏమి మాట్లాడటం లేదు… ఆ సినిమాతో ఆయన అనుకున్న విజయం సాధిస్తాడో లేదో చూద్దాం…
.