సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది డైరెక్టర్లు ఒక హిట్ సినిమా తీయడానికి చాలా తాపత్రయ పడుతుంటారు.ఇక్కడ హిట్ సినిమా అనేది నార్మల్ గా రాదు.
దానికోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది అలాంటివి చేయలేకే ఇండస్ట్రీ నుంచి చాలామంది డైరెక్టర్లు ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు.ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో ఒక హిట్టు కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్లు ఎవరు అంటే పల్నాటి సూర్య ప్రతాప్(Palnati surya prathap ) అనే చెప్పాలి.
ఈయన సుశాంత్ హీరో గా వచ్చిన కరెంట్ అనే సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది.ఆ తర్వాత ఆయన చాలా గ్యాప్ తీసుకుని సుకుమార్ రైటింగ్స్ లోనే రాజ్ తరుణ్ హీరోగా కుమారి 21ఎఫ్( Kumari 21 F ) అనే సినిమా తీశాడు.ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది దాంతో ఆయన తన తదుపరి చిత్రంగా 18 పేజెస్ అనే సినిమాని తీశాడు.ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటించగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.
ఇక ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకులను అలరించడంలో మాత్రం నిరాశపరిచిందనే చెప్పాలి.ఈ సినిమాకి సుకుమార్ కూడా రైటర్ గా వ్యవహరించాడు.
ఇంకా సూర్య ప్రతాప్ సుకుమార్( Sukumar ) దగ్గర ఆర్య సినిమా నుంచి వర్క్ చేస్తూ వస్తున్నాడు కాబట్టి సుకుమార్ అతనికి వరుసగా అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది.ఇక ప్రస్తుతం 18 పేజేస్ సినిమాతో ఒక ఫ్లాప్ ని మూట కట్టుకున్న సూర్య ప్రతాప్ కి అర్జెంటుగా ఒక హిట్ సినిమా కావాలి.లేకపోతే డైరెక్టర్ గా ఆయన కెరియర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే…ఇక మళ్లీ సుకుమార్ బ్యానర్ లోనే సినిమా చేస్తాడా లేదా బయట వేరే బ్యానర్లతో సినిమాలు చేస్తాడా అనేది సూర్య ప్రతాప్ మీద డిపెండ్ అయి ఉంటుంది…
.