టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది.ఈ మేరకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్నారు.
అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
విచారణలో భాగంగా చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున న్యాయవాది దూబే వాదనలు వినిపించారు.
ఈ క్రమంలోనే కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలని పొన్నవోలు కోర్టును కోరారు.చంద్రబాబుకు 17 ఏ వర్తించదని పొన్నవోలు తెలిపారు.
మరోవైపు చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవని ఆయన తరపు ప్రమోద్ కుమార్ దూబే వాదించారు.ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు.