నేచురల్ స్టార్ నాని( Nani ) .తన సహజ నటనతో నాచురల్ స్టార్ గా బిరుదు సంపాదించారు.
దసరా మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా 50 కోట్ల క్లబ్ లో చేరారు.ఇక ప్రస్తుతం నాని హీరోగా చేస్తున్న హాయ్ నాన్న డిసెంబర్ 21న భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుంది.
ఇక ఈ సినిమా తండ్రి కూతుర్ల అనుబంధం నేపథ్యంలో రాబోతుందట.అలాగే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) హీరోయిన్ గా చేస్తుంది.
అయితే హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని తన మొదటి క్రష్ ఎవరు.ప్రస్తుత క్రష్ ఎవరు అనే సీక్రెట్ ని బయటపెట్టారు.
నాని మాట్లాడుతూ.నేను మూడో తరగతి చదువుతున్న సమయంలోనే ప్రేమలో పడ్డాను.
కానీ లవ్ అంటే ఏంటో ఇప్పుడే నాకు తెలిసి వచ్చింది.
అయితే మూడో తరగతి చదువుతున్న సమయంలో మా స్కూల్లో ఫ్యాషన్ షో పోటీలు నిర్వహించారు.ఇక ఈ పోటీల్లో సోని( Sony ) అనే అమ్మాయి పొట్టి డ్రెస్ వేసుకొని చాలా అందంగా కనిపించింది.ఇక ఆ సమయంలో సోనీ ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడ్డాను.
ఇక అదే ఫ్యాషన్ షో పోటీల్లో నేను ఆకులు చుట్టుకొని పాల్గొన్నాను.అయితే ప్రస్తుతం ఆ అమ్మాయి కనిపిస్తే మాట్లాడతాను.
అలాగే ప్రజెంట్ నా క్రష్ కియారా ఖన్నా.
కియారా ఖన్నా ( Kiara Khanna ) ఓ రోజు చాలా అందంగా రెడీ అయి షూటింగ్ సెట్ కి వచ్చింది.ఆమెను చూసిన నేను మైమరచిపోయాను.అంతే కాదు ఒకవేళ నేను కూడా ఆమె ఏజ్ లో ఉంటే కచ్చితంగా కియారా పై మనసు పారేసుకునేవాడిని అంటూ నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇక కియారా ఖన్నా ఎవరో కాదు.నాని హీరోగా చేస్తున్న హాయ్ నాన్న (Hai Nanna) సినిమాలో నాని కూతురుగా చేస్తున్నది కియారా ఖన్నానే.ఇక హాయ్ నాన్న సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళ,కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల కాబోతోంది.బ్లాక్ బస్టర్ మూవీ దసరా సినిమా తర్వాత విడుదలవుతున్న హాయ్ నాన్న మూవీ పై నాని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.