చంద్రబాబు ( Chandra babu ) స్కిల్ డెవలప్ స్కాంలో భాగంగా అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే.ఈయన సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్ట్ కాగా 14 రోజులపాటు రిమాండ్ విధించారు.
దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా చంద్రబాబు నాయుడు కోసం వారి పనులన్నింటిని మానుకొని పెద్ద ఎత్తున ధర్నాలు చేపడుతున్నారు.అలాగే బాలయ్య లోకేష్ వంటి తదితరులు అధికారులతో సంప్రదింపులు జరుపుతూ బిజీగా ఉన్నారు.
ఇలా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో బాలకృష్ణ( Balakrishna )తన సినిమా షూటింగ్ పనులన్నింటినీ పక్కనపెట్టి రాజమండ్రిలోనే ఉంటున్నారు.
ఈ విధంగా చంద్రబాబు నాయుడు అరెస్టయి జైలుకు వెళ్ళగా ఈయన సినిమా షూటింగ్లను పక్కన పెట్టారు.ఇక ఈయన అనిల్ రావిపూడి (Anil Ravupudi) దర్శకత్వంలో నటిస్తున్నటువంటి భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari )అక్టోబర్ నెలలో విడుదల కావాల్సి ఉంది.అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ ఉండగా ఈ షూటింగ్ వాయిదా పడటంతో ఈ సినిమా అక్టోబర్లో విడుదల కాకపోవచ్చు అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే ఈ విషయం గురించి బాలకృష్ణ అనిల్ రావిపూడికి ఫోన్ చేసి నువ్వేమీ టెన్షన్ పడకు నీ సినిమా పూర్తి చేసిన తర్వాతే నేను మరొక సినిమాకు వెళ్తాను అంటూ ధైర్యం చెప్పారట.
ఇక మరొక డైరెక్టర్ బాబీ( Bobby ) తో కూడా ఈయన ఒక సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.ఇక బాలయ్య బాబికి ఫోన్ చేసి ఈ సినిమా ఎలక్షన్స్ తర్వాతనే తాను చేయగలను అంతవరకు వెయిట్ చేయగలుగుతాను అంటే వెయిట్ చేయమని లేకపోతే మరొక హీరోతో ఈ సినిమా చేసిన నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని బాబీకి కూడా చెప్పారట.అయితే బాబీ మాత్రం ఈ సినిమాలో మీరే కరెక్ట్ గా సరిపోతారు అప్పటివరకు మీకోసం ఎదురు చూస్తాను అంటూ సమాధానం చెప్పారట.
బాలకృష్ణ ఇంత బాధలో ఉన్నప్పటికీ తన డైరెక్టర్లు నష్టపోకూడదని వారికి ధైర్యం చెప్పడం చూసి బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తనని నమ్మిన వారిని బాలయ్య ఎప్పటికీ మోసం చేయరని అభిమానులు బాలయ్య విషయంలో గర్వపడుతున్నారు.