మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ramcharan ) ఉపాసన( Upasana ) దంపతులు ఇటీవల ఓ పెళ్లి వేడుక నిమిత్తం పారిస్ వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరూ ఎవరి పెళ్లికి వెళ్లారనే విషయం తెలియక పోయినప్పటికీ వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఉపాసన రాంచరణ్ దంపతులకు కుమార్తె జన్మించిన తర్వాత మొదటిసారి వీరిద్దరూ కలిసి ఫారెన్ వెకేషన్ వెళ్లారు.ఇలా వివాహ కార్యక్రమం నిమిత్తం ఈ దంపతులు ఈ పెళ్లి వేడుకలలో పాల్గొని సందడి చేశారు.
ఇలా పెళ్లి వేడుక పూర్తి అయిన అనంతరం వెంటనే ఉపాసన దంపతులు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
ఇలా హైదరాబాద్ చేరుకున్న అనంతరం ఈమె ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.దీంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి.ఈ ఫోటోలలో ఉపాసన రాంచరణ్ చాలా రాయల్ లుక్ లో కనిపించడంతో ఈ ఫోటోలను అభిమానులు మరింత వైరల్ చేస్తున్నారు.
ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ప్రియమైన రోజ్మిన్.నీకు శుభాకాంక్షలు.పారిస్ లో మీతో మరింత సరదగా గడిపాము అంటూ రాసుకొచ్చింది.
ఈ ఫోటోలలో రామ్ చరణ్ కస్టమ్ మేడ్ లేత గోధుమ రంగు సూట్ ధరించి రాయల్ లుక్ లో కనిపిస్తున్నారు.అలాగే ఉపాసన భారీ, క్లిష్టమైన గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ చేసిన రిచ్ బ్రౌన్ అనార్కలి సూట్ ధరించారు. మొత్తానికి ఈ ఫోటోలలో రామ్ చరణ్ ఉపాసన దంపతులు చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు.
ఇక రాంచరణ్ సినిమాల విషయానికొస్తే ఈయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ ( Game Changer ) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు.
ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
.