2016 నుంచి 2019 వరకు ఇన్ఫ్రా సంస్థలకు ఇచ్చిన సబ్ కాంట్రాక్ట్ లలో 118 కోట్ల రూపాయలు ముడుపులు చేతులు మారాయి అంటూ 153 సి సెక్షన్ ప్రకారం ఐటీ శాఖ చంద్రబాబుకు( Chandrababu Naidu ) నోటీసులు ఇవ్వడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.అమరావతి భూ సేకరణ లో నిర్మాణాల లోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసిపి నేతలు తీవ్రంగా వ్యాఖ్యలు చేసేవారు.
తాము అదికారం లోకి రాగానే చంద్రబాబు అవినీతి బాగోతం బయట పెడతామని , చందబాబు ని జైలు కి పంపిస్తామని జగన్ చెప్పేవారు .అయితే అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవహారంపై ఇంతకాలం మౌనంగా ఉన్నప్రబుత్వం ఇప్పుడు చంద్రబాబుకు ఐటి శాఖ నోటీసులు ఇవ్వడంతో మేము చెప్పింది నిజమైంది అంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
మంత్రి రోజా( Roja ) అయితే అమరావతి బాగోతం ఇ న్నాళ్లకు బయటపడిందని ,ఐటీ శాఖ వెలికి తీయడంతో చంద్రబాబు అవినీతి రాష్ట్రానికి తెలిసిందంటూ చెప్పుకొచ్చారు.తాను తప్పు చేయకపోతే చంద్రబాబు ఎందుకు పేదవి ఇప్పడం లేదంటూ మరో మంత్రి అమర్నాథ్( Gudivada Amarnath ) ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన అవినీతిపై మరిన్ని సంచలన విషయాలు తొందరలోనే బయటకు వస్తాయంటూ ఆయన చెప్పుకొచ్చారు.అయితే నోటీసులు వ్యవహారంపై చంద్రబాబు మాట్లాడకపోవడం తో తెలుగు తమ్ముళ్లకు ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి ఏర్పడినట్టుగా తెలుస్తుంది.
పొలిటికల్ డిబేట్ల లో కూడా తెలుగుదేశం అధికారం ప్రతినిధులకు ఈ విషయంపై స్పందించలేని పరిస్థితి నెలకొన్నట్లుగా తెలుస్తుంది .అసలు తమకు సంబంధం లేదని ఎటువంటి అవినీతి జరగలేదని చంద్రబాబు ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నారని, పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎందుకు ఈ విషయంలో తెలుగుదేశాన్ని ప్రశ్నించడం లేదంటూ అధికార పక్ష నేతలు స్పీడ్ పెంచేయడంతో తెలుగుదేశం పరిస్థితి ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తుంది.ఈ నోటీసుల వ్యవహారం లో కోర్టుల ద్వారా ఉపశమనం పొందడం చంద్రబాబుకు అంత కష్టం కాకపోయినప్పటికీ ఎన్నికలు దగ్గర్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూసుకుంటున్న అధికార పార్టీ ని వ్యూహాలను నిలువరించడమే ఇప్పుడు చంద్రబాబు ముందున్న అతిపెద్ద సమస్య.