వైరల్: అరెరే.. మన టీమ్ ఇండియా ప్లేయర్స్ ఇలా అయిపోయారు ఏంటి..?!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) అద్భుతాలను సృష్టిస్తూ చాలామందిని మైమరిపిస్తోంది.ఈ రోజుల్లో చాట్‌జీపీటీతో సహా క్రియేటివ్ కంటెంట్ సృష్టించగల ఏఐ టూల్స్ ఎన్నో అందుబాటులోకి వచ్చాయి.

 Ai-generated Images Of Indian Cricketers As Toddlers Rohit Sharma Ms Dhoni Virat-TeluguStop.com

నెటిజన్లు ఈ టూల్స్ సహాయంతో క్రియేటివిటీని వేరే లెవెల్ కి తీసుకెళ్తున్నారు.సోషల్ మీడియాలో ఏఐ సృష్టించిన క్రియేటివిటీని షేర్ చేస్తూ సామాన్య యూజర్లను అబ్బురపరుస్తున్నారు.

ఇందులో భాగంగా తాజాగా ఒక నెటిజన్ టీమిండియా క్రికెటర్లు( Team India Cricketers ) చిన్నపిల్లలుగా మారితే ఎలా కనిపిస్తారో ఏఐ సహాయంతో చేసి చూపించాడు.ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

కాస్త ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.ఇండియాలో క్రికెటర్లకు ఎంత క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.

అందుకే టీమిండియా క్రికెటర్ల కిడ్ వెర్షన్ల ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగానే వారి బాగా ఎట్రాక్ట్ అయ్యారు.ఆ ఫోటోలు చాలా తక్కువ సమయంలోనే వైరల్ గానూ మారాయి.

సదరు ఆర్టిస్ట్ ఏ AI టూల్‌ వాడాడో తెలియదు కానీ అతను ఏఐ సహాయంతో పసిపిల్లలుగా మార్చిన వారిలో విరాట్ కోహ్లీ, ( Virat Kohli ) ఎంఎస్ ధోనీ,(MS Dhoni ) రోహిత్ శర్మ,( Rohit Sharma ) రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, యుజ్వేంద్ర చాహల్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్‌లతో ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఈ పిక్స్‌లో బొద్దుగా ముద్దు ముద్దుగా విరాట్ కోహ్లీ కనిపిస్తే, కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ సీరియస్ లుక్‌లో దర్శనమిచ్చాడు.ఆ లుక్ అసలు ధోనీ పోలికలను ఏమాత్రం కలిగి లేదు.ఏఐ అతడిని చిన్నపిల్లోడిగా సరిగా ఊహించడంలో ఫెయిల్ అయింది.

ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను చిన్నపిల్లాడిగా, అమాయకంగా ఈ ఏఐ మార్చి చూపించింది.రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఇతరులందరూ కూడా చిన్నపిల్లల వెర్షన్లలో చాలా క్యూట్ గా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు.ఆ ఫోటోలని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube