గురువారం తెలుగు సినిమాకి 10 అవార్డులు రాగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) చరిత్ర సృష్టించాడు.జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డు నెలకొల్పారు.
పుష్ప చిత్రంలో నటనకు గాను అల్లు అర్జున్ ను విశిష్ట పురస్కారం వరించిన సంగతి తెలిసిందే.ఇక RRR కి 6 అవార్డులు వచ్చాయి.
అంతక ముందే ఆస్కార్ తో చరిత్ర సృష్టించిన RRR ఇప్పుడు మరోసారి 6 నేషనల్ అవార్డులు సొంతం చేసుకుంది.
కీరవాణి( Keeravani ) నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డుని( Oscar Award ) అందుకొని తెలుగు సినిమా చరిత్రలో ఒక చరిత్ర సృష్టించారు.
ఇప్పుడు 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ గాను నేషనల్ అవార్డుని అందుకున్నాడు.RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది.నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ ప్రజాదరణ పొందిన ఫీచర్ ఫిలింగా RRR పురస్కారం సొంతం చేసుకుంది.ఎన్టిఆర్,( NTR ) రాంచరణ్( Ram Charan ) అద్భుతమైన పెరఫార్మన్స్ లతో అదరగొట్టారు.
ఇక రాజమౌళి( Rajamouli ) తనదైన స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తో తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లారు.అయితే కీరవాణికి ఇది మొదటి నేషనల్ అవార్డు కాదు.
ఇంతక ముందే కీరవాణి ఒక అవార్డు అందుకున్నారు.
1997 లో నాగార్జున( Nagarjuna ) హీరోగా తెరకెక్కిన భక్తిరసా చిత్రం ‘అన్నమయ్య’ సినిమాకి( Annamayya Movie ) కీరవాణి అవార్డుని అందుకున్నారు.ఈ సినిమా అప్పట్లోనే ఒక సంచలనం.మళ్ళీ 26 ఏళ్ళ తరువాత కీరవాణి ఇప్పుడు RRR సినిమాకి నేషనల్ అవార్డుని గెలుచుకున్నారు.
కీరవాణితో పాటు మొదటిసారి పుష్ప మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్( Devisri Prasad ) కూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డుని అందుకున్నాడు.ఈ అవార్డు దేవి కెరీర్ ని మార్చేస్తుందని చెప్పాలి.
ఇక త్వరలోనే పుష్ప 2 సినిమా కూడా విడుదల కానుంది.కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే కాదు 1967 నుంచి ఇప్పటివరకు ఏఏ సంవత్సరంలో ఏఏ సినిమాకు గాను ఎవరెవరు అవార్డులు అందుకున్నారో ఇప్పుడు ఒక లుక్ వేద్దాం.
1979 – కె.వి.మహదేవన్ (మూవీ – శంకరాభరణం)1982 – రమేష్ నాయుడు (మూవీ – మేఘసందేశం)1983 – ఇళయరాజా (మూవీ – సాగర సంగమం)1988 – ఇళయరాజా (మూవీ – రుద్రవీణ)1997 – ఎం ఎం కీరవాణి (మూవీ – అన్నమయ్య)2004 – విద్యాసాగర్ (మూవీ – స్వరాభిషేకం)2013 – శంతను మొయిత్రా (మూవీ – నా బంగారు తల్లి)2020 – థమన్ (మూవీ – అల వైకుంఠపురములో)2021 – ఎం ఎం కీరవాణి (మూవీ – RRR)2021 – దేవిశ్రీప్రసాద్ (మూవీ – పుష్ప)
.