ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది ప్రజలు ఎదుటి వాళ్ళ ఎదుగుదలని చూసి అసూయ పడుతూ ఉంటారు.అలాగే వాళ్ల ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఉంటారు.
అలా జరగడం వల్ల దిష్టి తగులుతూ ఉంటుంది.మన మీద చెడు ప్రభావం పడడం వల్ల మనకి ఇబ్బందిగా ఉండడం, నీరసంగా అనిపించడం లేదంటే దిష్టి కారణంగా మనం సతమతం అవడం వంటివి చోటు చేసుకుంటాయి.
అయితే దిష్టి పోవాలంటే ఇలా సులభంగా దిష్టిని తొలగించుకోవచ్చు.మరి ఇక ఎదుటి వాళ్లు మీ మీద ఏడుస్తున్నట్లు అయితే ఆ దిష్టి పోవాలంటే ఈ విధంగా పాటించడం ఎంతో మంచిది.
ముఖ్యంగా చెప్పాలంటే స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపుని నీళ్లలో వేసుకుని స్నానం చేస్తే దిష్టి అంతా తొలగిపోతుంది.అంతే కాకుండా ఇలా చేస్తే త్వరగా దిష్టి నుంచి బయటపడవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే నరదిష్టి( Nardishti ) కారణంగా అనారోగ్య సమస్యల( Health problems )తో చాలామంది బాధపడుతూ ఉంటారు.అలాంటి వారు హనుమాన్ చాలీసా( Hanuman Chalisa )ని తొమ్మిది సార్లు పారాయణం చేసి హనుమంతుడికి అరటిపండు నైవేద్యంగా పెడితే ఆ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.
అలాగే ఇలా చేయడం వల్ల ఎలాంటి బాధలు కూడా దగ్గరికి రావు.
ఇంకా చెప్పాలంటే నర దిష్టి తొలగిపోవాలంటే ఉప్పుతో మూడుసార్లు పైనుంచి కిందికి తిప్పి ఆ ఉప్పుని బయట పారేస్తే సరిపోతుంది.అలాగే బూడిద గుమ్మడికాయ( Gray pumpkin ) అయినా సరే మూడుసార్లు అటూ ఇటూ తిప్పి ఎవరూ లేని చోట పరవేస్తే దిష్టి అంతా తొలగిపోతుంది.నర దిష్టి వలన విపరీతమైన సమస్యలను చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు.
నర దిష్టి తగిలితే అమ్మవారి దేవాలయంలో ఎర్రని గాజులు, చీర ఇస్తే నర దిష్టి తొలగిపోతుంది.స్నానం చేసే నీళ్లలో ఉప్పు( salt ) వేసుకొని స్నానం చేస్తే కూడా నెగిటివ్ ఎనర్జీ తొలిగి హాయిగా జీవించవచ్చు అని పండితులు చెబుతున్నారు.