ఉత్తమ చిత్రంగా ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకోబోతున్న సీతారామం?

డైరెక్టర్ హను రాఘవపూడి( Hanu Raghavapudi ) దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) , మృణాల్ ఠాకూర్( Mrunal Thakur )! జంటగా నటించిన చిత్రం సీతారామం( Sitaramam ) .అద్భుతమైన ప్రేమకథాచిత్రంగా ఈ సినిమా గత ఏడాది ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అన్ని భాషలలోను ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

 Seetharam To Receive The Prestigious Award Sitaramam, Dulqar Salman, Mrunal Th-TeluguStop.com

ఇలా ఈ సినిమా అన్ని భాషలలో ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఎంతోమంది సినీ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకుంది.ఈ సినిమా ద్వారా నటుడు దుల్కర్ సల్మాన్ అలాగే మృణాల్ ఇద్దరూ కూడా తెలుగులో మంచి ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా ఇతర సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు.

ఈ విధంగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సీతారామం సినిమా తాజాగా అరుదైన అవార్డును అందుకోబోతోంది.మెల్బోర్న్ వేదికగా ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభం అయింది.ఈ నెల 20 వరకు ఈ వేడుక జరగనుంది.ఈ క్రమంలోనే ఈ వేడుకలో పలు సినిమాలు వివిధ కేటగిరీలలో అవార్డులు అందుకోబోతున్నాయి.ఈ అవార్డుల జాబితాను శుక్రవారం విడుదల చేశారు.ఇందులో భాగంగా సీతారామం సినిమా కూడా ఉండడం విశేషం.

ఇందులో ఉత్తమ చిత్రంగా సీతా రామం నిలవడం విశేషం.దేశ రక్షణలో భాగంగా పాకిస్తాన్ కి పెట్టుబడి ప్రాణాలు కోల్పోయిన సైనికుడి ప్రేమ కథని ఎంతో అద్భుతంగా జనరంజకంగా హను రాఘవపూడి తెరకెక్కించారు.అయితే ఈ సినిమా ఆగస్టు 5వ తేదీకి విడుదలై సరిగా ఏడాది పూర్తి చేసుకుంది.ఇలా ఈ సినిమా ఇలాంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకోవడంతో చిత్ర బృందం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం దుల్కర్ తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యారు.ఇక మృణాల్ నాని సరసన హాయ్ నాన్న ( Hi Nanna )అనే సినిమాలో నటించారు.

అలాగే విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్ పనులలో కూడా ఈమె బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube