బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.చేనేత అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టామన్న మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం నేతన్నలను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు.
దివాలా తీసిన పోచంపల్లి చేనేత పార్కును ప్రభుత్వం కొనుగోలు చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.ఈ క్రమంలోనే పోచంపల్లి చేనేత పార్క్ ను పునరుద్ధరించి నేతన్నలకు ఉపాధి కల్పించాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు.
నేతన్నలను బీమాతో ఆదుకుంటామన్న కేటీఆర్ 75 ఏళ్ల వయసు వరకు నేతన్న బీమా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.అదేవిధంగా రూ.40 కోట్లతో కొత్త మగ్గాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో తమది చేతల ప్రభుత్వం.
చేనేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు.







