ఉత్తమ చిత్రంగా ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకోబోతున్న సీతారామం?

డైరెక్టర్ హను రాఘవపూడి( Hanu Raghavapudi ) దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) , మృణాల్ ఠాకూర్( Mrunal Thakur )! జంటగా నటించిన చిత్రం సీతారామం( Sitaramam ) .

అద్భుతమైన ప్రేమకథాచిత్రంగా ఈ సినిమా గత ఏడాది ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అన్ని భాషలలోను ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

ఇలా ఈ సినిమా అన్ని భాషలలో ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఎంతోమంది సినీ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకుంది.

ఈ సినిమా ద్వారా నటుడు దుల్కర్ సల్మాన్ అలాగే మృణాల్ ఇద్దరూ కూడా తెలుగులో మంచి ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా ఇతర సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు.

"""/" / ఈ విధంగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సీతారామం సినిమా తాజాగా అరుదైన అవార్డును అందుకోబోతోంది.

మెల్బోర్న్ వేదికగా ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభం అయింది.

ఈ నెల 20 వరకు ఈ వేడుక జరగనుంది.ఈ క్రమంలోనే ఈ వేడుకలో పలు సినిమాలు వివిధ కేటగిరీలలో అవార్డులు అందుకోబోతున్నాయి.

ఈ అవార్డుల జాబితాను శుక్రవారం విడుదల చేశారు.ఇందులో భాగంగా సీతారామం సినిమా కూడా ఉండడం విశేషం.

"""/" / ఇందులో ఉత్తమ చిత్రంగా సీతా రామం నిలవడం విశేషం.దేశ రక్షణలో భాగంగా పాకిస్తాన్ కి పెట్టుబడి ప్రాణాలు కోల్పోయిన సైనికుడి ప్రేమ కథని ఎంతో అద్భుతంగా జనరంజకంగా హను రాఘవపూడి తెరకెక్కించారు.

అయితే ఈ సినిమా ఆగస్టు 5వ తేదీకి విడుదలై సరిగా ఏడాది పూర్తి చేసుకుంది.

ఇలా ఈ సినిమా ఇలాంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకోవడంతో చిత్ర బృందం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం దుల్కర్ తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యారు.

ఇక మృణాల్ నాని సరసన హాయ్ నాన్న ( Hi Nanna )అనే సినిమాలో నటించారు.

అలాగే విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్ పనులలో కూడా ఈమె బిజీగా ఉన్నారు.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?