కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.గుడివాడ నియోజకవర్గంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఇందులో భాగంగానే చిరంజీవికి మాజీ మంత్రి కొడాలి నాని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.జై చిరంజీవ, కొడాలి నాని డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అనంతరం అభిమానుల నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పోలీసులకు, చిరంజీవి అభిమానులకు మధ్య తోపులాట జరగడంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
ఈక్రమంలోనే వాగ్వివాదానికి దిగిన పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల తీరును నిరసిస్తూ కొందరు అభిమానులు విజయవాడ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు.
అనంతరం వంగవీటి విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఫ్యాన్స్ 2024 ఎన్నికల్లో కొడాలి నానికి బుద్ది చెబుతామని తెలిపారు.