టాలీవుడ్ స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒకరు.ఈయనకు అత్యంత ఆప్తుడు అంటే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) అనే చెప్పాలి.
వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం గురించి అందరికి తెలుసు.అలాగే వీరు కలిసి సినిమాలు కూడా తీయగా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.
పవన్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సినిమాలన్నీ సెన్సేషనల్ రికార్డ్స్ అందుకున్నాయి.
ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ తో ప్రత్యక్షంగా సినిమాలు చేయక పోయినప్పటికీ పవన్ తీసే ప్రతీ సినిమాలో ఇంవోల్వ్ అవుతున్నారు.
ఈ మధ్య కాలంలో పవర్ స్టార్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుండి పవన్ చేస్తున్న ప్రతీ సినిమాలో త్రివిక్రమ్ ఇంవోల్వ్ మెంట్ అనేది ఉంటూనే ఉంది.ఇక పవన్ నటించిన హ్యాట్రిక్ రీమేక్ సినిమాలకు త్రివిక్రమ్ అన్ని దగ్గరుండి చూసుకున్నారు.
వకీల్ సాబ్ సినిమా( Vakeel Saab )కు ఆ తర్వాత భీమ్లా నాయక్( Bheemla Nayak ) సినిమాకు ఇక ఇప్పుడు వచ్చిన బ్రో సినిమాకు త్రివిక్రమ్ ఇంవోల్వ్ మెంట్ ఖచ్చితంగా ఉంటూనే ఉంది.అయితే తాజాగా బ్రో సినిమా జులై 28న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే ఇచ్చిన విషయం విదితమే.ఈ విషయంలోనే పవన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మొదటి మూడు రోజులు ఏమో కానీ 4వ రోజు కలెక్షన్స్ చూసిన తర్వాత పవన్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.రీమేక్స్ ను మాత్రం త్రివిక్రమ్ సజెస్ట్ చేస్తున్నారు.రీమేక్ సినిమాలకు ఓపెనింగ్స్ మాత్రం వచ్చిన ఆ తర్వాత కలెక్షన్స్ రావని అంటున్నారు.దీంతో పవన్ ఇమేజ్ పోతుంది అంటున్నారు.అయితే మరికొంత మంది పవన్ ఇప్పుడు ఆర్ధికంగా బలంగా ఉండాలంటే ఫాస్ట్ గా పూర్తి అయ్యే సినిమాలు చేయడం ముఖ్యం అని అందుకే త్రివిక్రమ్ పవన్ కు అన్ని వేళలా తోడుంటున్నారు అంటూ అంటున్నారు.