Akshay Kumar : ఈ స్టార్ హీరో ఫ్లాప్ సినిమాల నష్టం 1000 కోట్లా.. అంతమంది నిర్మాతలను ముంచేశాడా?

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్( Bollywood Hero Akshay Kumar ) గురించి మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ లో ఉన్న సూపర్ స్టార్ హీరోలలో అక్షయ్ కుమార్ కూడా ఒకరు.

 Bollywood Actor Akshay Kumar With Biggest Flops Has Cost Producers Rs 1000 Cror-TeluguStop.com

హిందీలో భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోలలో అక్షయ్ కుమార్ పేరు ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు.ఆ హీరో రెమ్యూనరేష‌న్ తగ్గట్టుగా సినిమా హిట్ అయితే పర్వాలేదు కానీ ప్లాప్ అయితే మాత్రం నిర్మాతలకు కష్టాలు తప్పవు.

ఇలాంటి క్ర‌మంలో అక్షయ్ కుమార్ ఫ్లాప్ సినిమాల వ‌ల్ల సుమారు వెయ్యి కోట్ల రూపాయలు నష్టం కలిగిందట.ఆ డ‌బ్బంతా ఒకే వ్య‌క్తిది కాక‌పోవ‌చ్చు.

కొంత‌మంది నిర్మాత‌ల‌దీ కాక‌పోవ‌చ్చు.

Telugu Akshay Flop, Akshay Kumar, Bollywood, Producers-Movie

అయితే ఇప్పుడున్న మార్కెట్ విధానం ప్ర‌కారం డిస్ట్రిబ్యూట‌ర్లు తీవ్రంగా న‌ష్ట‌పోతూ ఉన్నారు.ఒక పెద్ద హీరో సినిమా పోయిందంటే, నిర్మాత‌కు పోయేది పెద్ద‌గా లేదు.ఏరియా కొద్దీ డిస్ట్రిబ్యూట‌ర్లు త‌లా కొంత పోగొట్టుకుంటూ ఉంటారు.

భారీ బ‌డ్జెట్ సినిమాల న‌ష్టం ఒక‌రి మీద కాకుండా, చాలా మంది చేతుల్లోంచి పోతోంది కాబ‌ట్టి క‌న‌ప‌డ‌దు.అక్షయ్ కుమార్ ఇటీవల నటించిన కొన్ని సినిమాలు దాదాపు నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల న‌ష్టాల‌ను మిగిల్చాయ‌ట‌.

స‌మ్రాట్ పృథ్విరాజ్ వాటా 140 కోట్లు అయితే, రామ్ సేతు( Ram Setu ) వాటా 70 కోట్లు.వాటితో పాటు రక్షాబంధ‌న్, బ‌చ్చ‌న్ పాండే, త‌షాన్, రౌడీ రాథోడ్, కంబ‌క్త్ ఇష్క్ వంటి రీమిక్స్ తో భారీగా ఫ్లాప్ సినిమాలను ఖాతాలో వేసుకున్నాడు.

Telugu Akshay Flop, Akshay Kumar, Bollywood, Producers-Movie

ఇత‌డి కెరీర్ లో మ‌రి కొన్ని ఫ్లాప్ సినిమాల న‌ష్టాల‌ను క‌లిపితే మొత్తం విలువ వెయ్యి కోట్ల పై మాటేన‌ట‌.అలాగే సూప‌ర్ హిట్స్ కు కూడా లోటు లేదు.ఒక్కోసారి చాలా త‌క్కువ బ‌డ్జెట్ తో అక్ష‌య్ సినిమాలు రెడీ అయిపోతాయి.అలాంటి సినిమాలు వ‌చ్చిన‌ప్పుడు లాభాలు.అందుకే అక్ష‌య్ స్టార్ హీరో.ఇప్ప‌టి వ‌ర‌కూ కెరీర్ లో వంద సినిమాల వ‌ర‌కూ చేసిన ఈ హీరో కెరీర్( Akshay Kumar Flop Movies ) లో 60 శాతం ఫ్లాపులున్నాయి.

మిగ‌తావి బ్రేక్ ఈవెన్ నుంచి లాభాల వ‌ర‌కూ వెళ్లిన సినిమాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube