ఘనంగా సినారె 92వ.జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) మారుమూల హనుమాజిపేట గ్రామంలో జన్మించిన సినారె తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియల్లో రచనలు చేయడమే గాకుండా ఆధునికాంధ్ర కవిత్వం- సంప్రదాయములు- ప్రయోగములు అను అంశంపై పరిశోధన చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని, తెలుగు సాహితీ జ్ఞానపీఠ శిఖరమనీ రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి ( Dr.Singireddy Narayana Reddy )92వ జయంతిని జిల్లా గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సమావేశంకు అధ్యక్షుడుగా ఎలగొండ రవి వ్యవహరించగా, డా.వాసరవేణి పరశురాం సభాసమన్వయం కర్తగా చేశారు.ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ నేటి యువకవులు సినారె ను స్ఫూర్తిగా తీసుకోవాలని,సినారె కాంస్య విగ్రహం పెట్టడానికి మంత్రి కె.టి.ఆర్ 10లక్షల రూపాయలు కెటాయించారనీ గుర్తుచేస్తూ ధన్యవాదాలు తెలిపారు.ప్రముఖ కవి జూకంటి జగన్నాధం మాట్లాడుతూ సినారె హనుమాజిపేట సిరిసిల్ల నుండి డిల్లీవరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగుభాషా సాహిత్యానికి వన్నె తెచ్చారనీ, మనిషి చిలుక, మధ్యతరగతి మందహాసం,నాగార్జునసాగరం, ప్రపంచ పదులు, కర్పూరవసంతరాయులు, నవ్వనిపువ్వు మొదలగు అనేక గ్రంథాలు సినిమా పాటలు రచించారనీ, సినారె పరిశోధనగ్రంథం ప్రామాణికమైనదనీ సినారె సాహిత్యాన్ని ప్రతి ఒక్కరు అధ్యయనం చేయాలని అన్నారు.
పలువురు కవులు సినారె సాహిత్యం జీవితంపై ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ప్రముఖ కవి జూకంటి జగన్నాధం, ప్రముఖ కవి పరిశోధకులు డా.జనపాల శంకరయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఎలగొండ రవి, ప్రధానకార్యదర్శి డాక్టర్ వాసరవేణి పరశురాం, ఉపాధ్యక్షులు వెంగల లక్ష్మణ్, బూర దేవానందం, కోశాధికారి ఆడెపు లక్ష్మణ్,కార్యనిర్వాహక కార్యదర్శులు గోనె బాల్ రెడ్డి, వెంగల నాగరాజు, చిటికెన కిరణ్ కుమార్, బుర్క గోపాల్, ఈడెపు సౌమ్య, ముడారి సాయిమహేశ్, కోడెం నారాయణ, నర్రా అంజన్ రెడ్డి, కామారపు శ్రీనివాస్, భీమనాధుని, దూడం గణేష్, రేగుల భిక్షపతి, 30 మంది కవులు తదితరులు పాల్గొన్నారు.