పెళ్లంటే నూరేళ్ళ పంట అని కొందరు, నూరేళ్ళ మంట అని కొందరు చెబుతూ వుంటారు.ఎవరి బాధ వారిది.
వివాహ వేడుకలు మన ప్రపంచంలో ఏ మాదిరి జరుపుకుంటారో అందరికీ తెలిసినదే.అంగరంగ వైభవంగా ఆహుతుల మధ్య అందరి దృష్టిని ఆకర్షించేలా వేడుక చేసుకోవటం ఎప్పటినుండో వస్తుంది.
కానీ కొందరు వినూత్నంగా ఆలోచించి వివాహం చేసుకోవటం ద్వారా సోషల్ మీడియా( Social media )లో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటారు.అవును, కొందరు పెళ్లిని మరి రిస్క్ అని భావిస్తారో ఏమోగానీ రిస్క్ చేసి మరీ పెళ్లి చేసుకుంటారు.
అవును, ఈ విషయం మీకు అర్థం కావాలంటే మీరు ఈ కధనం చదవాల్సిందే.
పెళ్లి అంటేనే రిస్క్ అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం ఏమిటో గానీ చాలా రిస్క్ చేసారు వారు.అయితే ఏదో కొత్తగా చెయ్యాలి అన్న తపన కూడా వీరికి ఉండవచ్చు.ఎందుకంటే ఇక్కడ ఎవరి పిచ్చి వారిది.
అవును, తాజాగా ఓ జంట తమ వివాహాన్ని జీవితాంతం గుర్తుండి పోయేలా జరుపుకోవాలని నిర్ణయించింది.ఆ మేరకు ఎత్తైన కొండలపై నుంచి స్కైడైవింగ్ చేస్తూ మరీ తమ వివాహాన్ని కానిచ్చేశారు.
ఈ తంతు చుసిన జనాలు ఇంకా నయం శోభనం కూడా స్కైడైవింగ్( sky diving ) చేస్తూ చేసుకొనేవారు కాబోలు… అని కామెంట్ చేయడం ఇపుడు చాలా కామెడీగా అనిపిస్తోంది.కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విషయం ఏమంటే, వధూవరులు ఇద్దరు ఇన్స్పెక్టర్ల సహాయంతో ఎత్తయిన కొండమీద నుండి అమాంతంగా దూకేశారు.ఆ తరువాత పారాచూట్ లు ఓపెన్ అవ్వడంతో సేఫ్ గా ల్యాండ్ అయ్యారు.ఆ సమయంలో అత్యంత భయంకరమైన కొండలపై నుంచి స్కైడైవింగ్ ద్వారా జరిగిన ఈ వివాహానికి హాజరైన స్నేహితుల బంధువులు తమ చప్పట్లతో వధూవరులను ఆశీర్వదించారు.ఈ వీడియోను లలిబ్రేటమోరద అనే వ్యక్తి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియోని నెటిజనం తెగ చూస్తున్నారు.
అంతేకాదు ఎవరికీ నచ్చినట్టు వారు కామెంట్ల దాడి చేస్తున్నారు.ఎవరి పిచ్చి వారికానందం అని ఒకరు కామెంట్ చేస్తే, వినాశకాలే విపరీత బుద్ధి అని మరొకరు కామెంట్ చేస్తున్నారు!
.