సినీ ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి ఎలా పుట్టుకొస్తాయో తెలియదు కానీ అవి ఒక్కోసారి నిజం అవుతుంటాయి.మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించక ముందే రూమర్స్ అనేవి ఎవరో ఒకరి ద్వారా రివీల్ అవుతూనే ఉంటాయి.
మరి నిన్నంతా వైరల్ అయిన రూమర్ ఈ రోజు నిజమే అని తేలిపోయింది.మరి ఆ రూమర్స్ ఏంటి? ఏ సినిమా విషయంలో వచ్చిన రూమర్స్ నిజమే అని తేలాయి అంటే.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని( Ram potheneni ) మాస్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో రాబోతున్న రెండవ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’( Double iSmart ).ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం విదితమే.ఈ సినిమాతో ఇద్దరు సాలిడ్ హిట్ అందుకుని కెరీర్ లో మరో మెట్టు పైకి ఎక్కారు.ఇక ఇప్పుడు నాలుగేళ్ళ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కనుంది.
ఈ నెలలోనే గ్రాండ్ గా లాంచ్ చేసుకున్న ఈ సినిమా వెంటనే షూట్ కూడా స్టార్ట్ చేశారు.ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ ను అఫిషియల్ గా ప్రకటించారు మేకర్స్.ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనుండగా ఇందులో ఒక ముఖ్య పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ( Bollywood star Sanjay Dutt )ను తీసుకోవాలని పూరీ అనుకుంటున్నారు అంటూ రూమర్స్ నిన్నంతా వైరల్ అయ్యాయి.
మరి ఇదే న్యూస్ ఈ రోజు తెల్లారగానే అఫిషియల్ గా మేకర్స్ ప్రకటించారు.దీంతో ఈ బాలీవుడ్ స్టార్ ఈ సినిమాలో కన్ఫర్మ్ అయిపోయాడు.కొద్దిసేపటి క్రితం ఈ సినిమాలో సంజయ్ దత్ ఉన్నట్టు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసారు.
అంతేకాదు ఈయన ఈ పోస్టర్ లో సిగార్ కాలుస్తూ డాషింగ్ లుక్ లో కనిపిస్తుండగా ‘బిగ్ బుల్’ అనే రోల్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలుపగా ఈ పోస్టర్ ఆసక్తికరంగా మారింది.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 8న రిలీజ్ కానుండగా ఛార్మి కౌర్ తో కలిసి పూరీ కనెక్ట్స్ పై విష్ణు రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.