నాగ చైతన్య - చందు మొండేటి మూవీపై క్రేజీ అప్డేట్.. రొమాంటిక్ మూవీగా..

అక్కినేని యువ హీరోల్లో నాగ చైతన్య( Naga Chaitanya ) ఒకరు.అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈయనకు ఈ మధ్య మళ్ళీ ఈయన టైం బాలేనట్టు అనిపిస్తుంది.

 Latest Buzz On Naga Chaitanya-chandoo Mondeti Film , Naga Chaitanya , Chandoo Mo-TeluguStop.com

థాంక్యూ, హిందీ డెబ్యూ సినిమా లాల్ సింగ్ చద్దా తాజాగా వచ్చిన కస్టడీ కూడా ఈయనను ప్లాప్స్ నుండి బయట పడేయలేక పోయాయి.

Telugu Allu Aravind, Chandoo Mondeti, Geetha, Latestbuzz, Naga Chaitanya, Savyas

నాగ చైతన్య వెంకట్ ప్రభు ( Venkat Prabhu ) దర్శకత్వంలో కస్టడీ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాతో హిట్ అందుకోవాలని ఆశ పడిన చైతూకు నిరాశనే ఎదురైంది.ఇక ఈ సినిమా తర్వాత చైతూ ఎలాంటి సినిమా చేస్తాడు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దీనిపై ఇప్పటి వరకు అఫిషియల్ అప్డేట్ రాలేదు.అయితే చందు మొండేటితో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు అని టాక్ వస్తుంది.

Telugu Allu Aravind, Chandoo Mondeti, Geetha, Latestbuzz, Naga Chaitanya, Savyas

ఇప్పటికే ఈ ఇద్దరు కలిసి ప్రేమమ్, సవ్యసాచి ( Savyasachi )వంటి సినిమాలు చేసారు.ఈ రెండు కూడా మంచి విజయాలు అందుకున్నాయి.ఇప్పుడు ముచ్చటగా మూడవసారి ఈ కాంబో రిపీట్ కాబోతుంది.ఇదిలా ఉండగా ఈసారి ఈ సినిమాను భారీ స్థాయిలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియన్ సినిమాగా నిర్మించనున్నట్టు టాక్.

ఈ సినిమా గత కొన్ని వారాలుగా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది.ఇక అక్టోబర్ నుండి షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ అయ్యింది.ఈ సినిమా ఫుల్ రొమాంటిక్ కథగా రూపొందుతుందని.

శ్రీకాకుళం, విశాఖపట్నం, ఆముదాలవలస, గుజరాత్ ప్రాంతాల్లో తెరకెక్కించడానికి లొకేషన్స్ సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది.ఇక చైతూ ఈ సినిమాలో మత్సకారుడిగా కనిపించనున్నట్టు ఇప్పటికే కథనాలు వచ్చాయి.

మరి ఈసారి ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube