నాగ చైతన్య – చందు మొండేటి మూవీపై క్రేజీ అప్డేట్.. రొమాంటిక్ మూవీగా..

అక్కినేని యువ హీరోల్లో నాగ చైతన్య( Naga Chaitanya ) ఒకరు.

అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈయనకు ఈ మధ్య మళ్ళీ ఈయన టైం బాలేనట్టు అనిపిస్తుంది.

థాంక్యూ, హిందీ డెబ్యూ సినిమా లాల్ సింగ్ చద్దా తాజాగా వచ్చిన కస్టడీ కూడా ఈయనను ప్లాప్స్ నుండి బయట పడేయలేక పోయాయి.

"""/" / నాగ చైతన్య వెంకట్ ప్రభు ( Venkat Prabhu ) దర్శకత్వంలో కస్టడీ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాతో హిట్ అందుకోవాలని ఆశ పడిన చైతూకు నిరాశనే ఎదురైంది.ఇక ఈ సినిమా తర్వాత చైతూ ఎలాంటి సినిమా చేస్తాడు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దీనిపై ఇప్పటి వరకు అఫిషియల్ అప్డేట్ రాలేదు.అయితే చందు మొండేటితో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు అని టాక్ వస్తుంది.

"""/" / ఇప్పటికే ఈ ఇద్దరు కలిసి ప్రేమమ్, సవ్యసాచి ( Savyasachi )వంటి సినిమాలు చేసారు.

ఈ రెండు కూడా మంచి విజయాలు అందుకున్నాయి.ఇప్పుడు ముచ్చటగా మూడవసారి ఈ కాంబో రిపీట్ కాబోతుంది.

ఇదిలా ఉండగా ఈసారి ఈ సినిమాను భారీ స్థాయిలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియన్ సినిమాగా నిర్మించనున్నట్టు టాక్.

ఈ సినిమా గత కొన్ని వారాలుగా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది.

ఇక అక్టోబర్ నుండి షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ అయ్యింది.

ఈ సినిమా ఫుల్ రొమాంటిక్ కథగా రూపొందుతుందని.శ్రీకాకుళం, విశాఖపట్నం, ఆముదాలవలస, గుజరాత్ ప్రాంతాల్లో తెరకెక్కించడానికి లొకేషన్స్ సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది.

ఇక చైతూ ఈ సినిమాలో మత్సకారుడిగా కనిపించనున్నట్టు ఇప్పటికే కథనాలు వచ్చాయి.మరి ఈసారి ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

కౌశిక్ తల్లి చెప్పిన కామెంట్లలో ఏ మాత్రం నిజం లేదు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ వైరల్!