అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసేటప్పుడు దానికి తగిన బట్టలు మాత్రమే ధరించాలి.అప్పుడే యాక్టివిటీ ఎంజాయ్ చేయడం కుదురుతుంది.
అలాగే ఎలాంటి రిస్క్ ఉండదు.అయితే ఒక మహిళ మాత్రం అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ అయిన సర్ఫింగ్ను( Surfing ) చీర కట్టుకొని చేసింది.
నీటి మీద ఆమె దూసుకెళ్తూ ఉంటే ఆ శారీ ఆకృతి పూర్తిగా మారిపోయింది.అది చూసేందుకు అంతగా బాగోలేదు.
శారీ కట్టుకునే కల్చర్ ఫాలో కావడం తప్పు కాదు కానీ ఎక్కడపడితే అక్కడ, ఏ పనిలో పడితే ఆ పనిలో వేసేసుకుని పొలోమని వెళ్లిపోవడం బాగోదు.
శారీలో సర్ఫింగ్( Saree Surfing ) చేసిన ఆ ముద్దుగుమ్మ పేరు కాత్యా సైనీ.( Katya Saini ) రీసెంట్గా ఈ లేడీ అడ్వెంచరర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో “కైట్ బోర్డింగ్ ఇండియా” ప్రమోట్ చేస్తున్నానంటూ ఓ సర్ఫింగ్ వీడియో షేర్ చేసింది.అందులో ఈమె సర్ఫ్ బోర్డు, రెక్కలు ఇంకా వాటర్ పై దూసుకెళ్లడానికి అవసరమైన అన్ని పరికరాలు సమకూర్చుకుంది.
ఆ తర్వాత ఆమె నీటిపై సర్ఫ్ చేయడం మొదలుపెట్టింది.అయితే ఇక్కడ వెరైటీగా కనిపించింది ఏంటంటే ఆమె అవుట్ ఫిట్.ఆమె మామూలుగా వాటర్ స్పోర్ట్స్ కోసం వేసుకునే డ్రెస్ కాకుండా శారీ కట్టుకొని కనిపించింది.
ఒకవైపు గాలులు భారీగా వీచడం, కింద నుంచి నీరు ఆమె కాళ్లను తాకడం వల్ల చీరకట్టు అంతా చెడిపోయింది.శారీలో ఇలాంటివి ట్రై చేస్తే అది సర్కస్ఫీట్ లా కనిపిస్తుందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.కొందరు మాత్రం ఈ యువతి స్టంట్ ను బాగా మెచ్చుకున్నారు.
బాగా ట్రై చేశారు అంటూ కితాబిచ్చారు.ఇంకొందరు ఫన్నీ లైన్స్ రాసి దీనిని ఒక ఫన్నీ వీడియో గా మార్చేశారు.
ఒక వారం క్రితం షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే రెండు లక్షలకు పైగా లైక్స్, మిలియన్ కొద్దీ వ్యూస్ సంపాదించింది.దీనిని మీరు కూడా చూసేయండి.