మెగాస్టార్ కోరిక తీర్చబోతున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. త్వరలోనే ప్రకటన?

కేజిఎఫ్ సిరీస్ ద్వారా దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) .అప్పటివరకు కేవలం కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయమైనటువంటి ఈయన ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

 Director Prashant Neel Is Going To Fulfill Megastar's Wish,prashanth Neel ,chira-TeluguStop.com

ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటు ప్రశాంత్ ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ప్రభాస్ ( Prabhas ) హీరోగా నటిస్తున్న సలార్ ( Salaar ) సినిమా పనులలో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారు.

ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్( NTR ) హీరోగా మరో సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే ఇది కాకుండా మరో ప్రాజెక్టు కూడా మొదలైందని తెలుస్తోంది.

Telugu Acharya, Chiranjeevi, Prashanth Neel, Ramcharan, Salaar, Tollywood-Movie

గత ఏడాది చిరంజీవి( Chiranjeevi ) ప్రశాంత్ నీల్ ను తన ఇంటికి ఆహ్వానించి తాను ఎలాంటి జానర్ లో సినిమా చేయాలనుకుంటున్నారో తెలియచేశారట.చిరంజీవికి ఎప్పటినుంచో ఒకే ఒక కోరిక తన కుమారుడు రామ్ చరణ్ ( Ramcharan )తో కలిసి ఫుల్ లెన్త్ సినిమాలో నటించాలన్నదే తన కోరిక అయితే ఇప్పటివరకు ఆ కోరిక నెరవేరలేదు.ఆచార్య( Acharya ) సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ సినిమా విషయంలో చిరంజీవి కూడా తృప్తిగా లేరని తెలుస్తుంది.ఈ క్రమంలోనే చరణ్ తో కలిసి ఆయన ఫుల్ లెన్త్ సినిమాలో నటించేలా ఓ కథ ప్రిపేర్ చేయమని చెప్పారట దీంతో ప్రశాంత్ 3 స్టోరీ లైన్స్ చెప్పగా అందులో చరణ్ చిరంజీవి 1 సెలెక్ట్ చేసి దానిని డెవలప్ చేయమని చెప్పారట.

Telugu Acharya, Chiranjeevi, Prashanth Neel, Ramcharan, Salaar, Tollywood-Movie

ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ ఈ సినిమా స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.ఇలా ప్రశాంత్ నీల్ ముందు చిరంజీవి తన కోరిక చెప్పడంతో ఈయన ఆ కోరికను నెరవేరుస్తున్నారని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన కూడా వెలవడు పోతుందని తెలుస్తోంది.ఇలా ఈ కాంబినేషన్లో సినిమా రాబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.సినిమాలో మరో  హీరోకి సెట్ అయ్యే క్యారెక్టర్ ఉందట.

ఆ పాత్ర సెకండాఫ్ లో వస్తుందని, కీ టైమ్ లో ట్విస్ట్ ఇస్తుందని సమాచారం.ఇక ఈ సినిమాని తెలుగు కన్నడ భాషలలో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube