బాడీ షేమింగ్ ట్రోల్స్ పై స్పందించిన బలగం బ్యూటీ... నేనెక్కడ చెప్పలేదంటూ క్లారిటీ?

అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా నటించిన గంగోత్రి ( Gangothri ) సినిమాలో బాలనాటిగా నటించిన అందరిని మెప్పించినటువంటి నటి కావ్య కళ్యాణ్ రామ్ ( Kavya Kalyan Ram ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా పలు సినిమాల ద్వారా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె బలగం సినిమా ( Balagam Movie ) ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

 Balagam Beauty Responded To Body Shaming Trolls, Kavya Kalyan Ram, Balagam Movie-TeluguStop.com

ప్రస్తుతం ఉస్తాద్ సినిమా (Ustad Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నటువంటి ఈమె తన గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందించారు.

Telugu Balagam, Ustad-Movie

ఈ సందర్భంగా ఈమె గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.కెరియర్ మొదట్లో అవకాశాల కోసం ప్రయత్నించిన సమయంలో కొందరి డైరెక్టర్లు తన పట్ల బాడీ షేమింగ్( Body Shaming ) ట్రోల్స్ చేస్తూ అవమానించారని, అవమానాలతో వెనుకడుగు వేయకుండా వారి ముందే గొప్ప స్థానంలోకి వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకుంటుంది అంటూ తన గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తలపై కావ్య స్పందించారు.ఈ సందర్భంగా తన గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందించినటువంటి ఈమె.

Telugu Balagam, Ustad-Movie

కొన్ని మీడియా సంస్థలలో నాపై దర్శకులు బాడీ షేమింగ్‌కి పాల్పడ్డారని నేను చెప్పినట్లుగా కథనాలను గమనించాను.నేనలా ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదు.ఆ కథనాలు నిజం కావు.ఇలాంటి తప్పుడు వార్తలు దయచేసి ప్రచారం చేయొద్దని ఆ వార్తలలో ఏ మాత్రం నిజం లేదంటూ థాంక్యూ అంటూ ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చారు.

మసూద సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైనటువంటి ఈమె బలగం సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక ఈమె నటించిన ఉస్తాద్ సినిమా ఆగస్టు 12వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube