ఈ ఐదు రకాల ఆహారాలు డైట్ లో ఉంటే మధుమేహంతో నో టెన్షన్!

ఇటీవల రోజుల్లో మధుమేహం ( Diabetes )వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది.రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటమే మధుమేహం.

 These Five Foods Help To Prevent From Diabetes , Diabetes, Five Foods, Best F-TeluguStop.com

దీనినే డయాబెటిస్ అని, షుగర్ వ్యాధి అని కూడా పిలుస్తారు.ఒక్కసారి మధుమేహం వచ్చిందంటే జీవితం కాలం మందులు వాడుతూనే ఉండాలి.

అలాగే బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవాలి.అందుకోసం ఎంతో ఇష్టమైన స్వీట్స్ ను దూరం పెట్టాలి.

కొన్ని కొన్ని రకాల ఫ్రూట్స్ ని అవాయిడ్ చేయాలి.ఎన్నో ఆహార నియమాలు పాటించాలి.

అందుకే మధుమేహం వచ్చాక బాధపడడం కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.

ఈ ఆహారాలు డైట్ లో ఉంటే మధుమేహంతో నో టెన్షన్.దాల్చిన చెక్క.

బిర్యానీ, పులావ్, నాన్ వెజ్ వంటల్లో ప‌డాల్సిందే.తియ్యటి రుచి కలిగి ఉండే దాల్చిన చెక్క( Cinnamon ) వంటలకు చక్కని ఫ్లేవర్ ను అందిస్తుంది.

అలాగే దాల్చిన చెక్కలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు నిండి ఉంటాయి.ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సమతుల్యం గా ఉంటాయి.

మధుమేహం వచ్చే రిస్క్ తగ్గుతుంది.

Telugu Avocado, Berry Fruits, Foods, Cinnamon, Diabetes, Tips, Latest, Walnuts-T

వాల్ నట్స్( Wall nuts ).ఖరీదు ఎక్కువే అయినప్పటికీ ఆరోగ్యానికి ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు.నైట్ అంతా వాటర్ లో నానబెట్టిన వాల్ నట్స్ ను రోజు ఉదయం రెండు లేదా మూడు చొప్పున తీసుకోవాలి.

ఇలా చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ లో హెచ్చుతగ్గులు ఏర్పడకుండా ఉంటాయి.మధుమేహం వ్యాధికి దూరంగా ఉండాలని కోరుకునేవారు ఆకుకూరల‌ను తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోండి.నిత్యం ఏదో ఒక ఆకుకూరను తినేందుకు ప్రయత్నించండి.ఆకుకూరల్లో ఉండే పోషకాలు శరీరానికి బోలెడంత శక్తిని అందిస్తాయి.

అదే సమయంలో డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Telugu Avocado, Berry Fruits, Foods, Cinnamon, Diabetes, Tips, Latest, Walnuts-T

అవకాడో..( Avocado ) అద్భుతమైన పండ్లలో ఇది ఒకటి.

రోజుకు ఒక అవకాడో పండును తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలో కంట్రోల్లో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెర్రీ పండ్లు కూడా షుగర్ వ్యాధి వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.

అందువల్ల స్ట్రాబెర్రీస్, బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్.ఇలా బెర్రీ పండ్లను తీసుకునేందుకు ప్రయత్నించండి.

ఇక ఈ ఆహారాలను డైట్ లో చేర్చుకోవడం తో పాటుగా పంచదార, పంచదార తో తయారు చేసే ఆహారాలను పూర్తిగా దూరం పెట్టండి.నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన మాంసం, కూల్ డ్రింక్స్ , ఫాస్ట్ ఫుడ్స్ ను డైట్ లో నుంచి కంప్లీట్ గా కట్ చేయండి.

తద్వారా మధుమేహానికి దూరంగా ఉండవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube