సాధారణంగా రైలు కదలాలంటే అందులో ఇంజన్ ఉండాలి.అలాగే డ్రైవర్ ఉండాలి, కానీ ఒక రైలు మాత్రం ఇంజన్, డ్రైవర్ రెండూ లేకుండా పట్టాలపై పరుగులు తీసింది.
ఇది చూసి దాంట్లో ఏమైనా దెయ్యం ఉందా అని స్థానికులు అవాక్కయ్యారు.వివరాల్లోకి వెళ్తే రీసెంట్‌గా, జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో ఇంజన్, డ్రైవర్ లేని రైలు దానంతట అదే కదిలింది.
ఈ ఘటన బర్హర్వా రైల్వే స్టేషన్( Barharwa Railway Station ) సమీపంలో జరిగింది, అక్కడ నాలుగు బోగీలు, ఒక రైల్వే వ్యాగన్ ఉన్నాయి.బోగీలు ఒక్కసారిగా కదలడం ప్రారంభించి చాలా దూరం ప్రయాణించి అదే స్టేషన్‌లో ఆగాయి.

ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురై ఈ ఘటనను తమ ఫోన్లలో బంధించారు.దీంతో రైల్వే అధికారులు( Railway officials ) కూడా షాక్‌కు గురై విచారణ చేపట్టారు.బోగీలు వాటంతట అవే ఎలా కదిలాయి.ఎందుకు ప్రమాదం జరగలేదు అనే దానిపై ఆరా తీస్తున్నారు.కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.ఈ ఘటనపై కొందరు అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తుండగా మరికొందరు విస్తుపోతున్నారు.
కొందరు దీనిని “ఆత్మ నిర్భర్ రైలు” ( Atma Nirbhar Train )లేదా “ఘోస్ట్ రైలు”( Ghost Train ) అని కూడా పిలుస్తున్నారు.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.ఈ ఘటనకు గల కారణాలను కూడా తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.రైలు బోగీలు వాటంతట అవే కదలడానికి కారణం బ్రేకులు ఫెయిల్ అయి ఉండవచ్చు.
బోగీలు ముందుకు కదలడానికి ట్రాక్‌పై వాలుగా ఉండి ఉండవచ్చు.ఈ రైలుకు సంబంధించి ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో 80 వేలకు పైగా వ్యూస్ పొందింది.
దీనిని మీరు కూడా చూసేయండి.







