సూపర్ స్టార్ రజనీ కాంత్( Rajinikanth ) చాలా రోజుల తర్వాత మళ్ళీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.ఈయన ప్రస్తుతం ఏడు పదుల వయసు దాటిన కూడా వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు.
హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.
ప్రెజెంట్ రజనీకాంత్ చేస్తున్న సినిమా ‘‘జైలర్”( Jailer Movie ).ఈ సినిమాకు ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేనంత హైప్ నెలకొంది.ఎన్నో ఏళ్ల ముందు సూపర్ స్టార్ ను చుసిన విధంగానే ఈ సినిమాలో రజినీకాంత్ కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ కు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగింది.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ సినిమా రిలీజ్ దగ్గర పడడంతో మేకర్స్ వరుస అప్డేట్ లను అందిస్తూ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ వచ్చింది.
ఈ సినిమాను ఆగస్టు 10, 2023న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.ఇదే డేట్ కు కన్ఫర్మ్ అయినట్టే అని ఇప్పుడు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీ ఎన్ని భాషల్లో రిలీజ్ కాబోతుందో క్లారిటీ వచ్చేసింది.రజినీకాంత్ తో పాటుగా అటు కన్నడ సహా మలయాళ భాషల్లో ఉన్న స్టార్స్ కూడా భాగం అయిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ సినిమా హిందీ మినహా సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ కాబోతుందట.అతి త్వరలోనే హిందీ భాషపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమాలో రజినీకాంత్ సరసన తమన్నా( Tamannaah Bhatia ) హీరోయిన్ గా నటిస్తుండగా.సన్ పిక్చర్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.అలాగే మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక రోల్స్ లో నటిస్తున్నారు.