తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తుంది.ఇందులో భాగంగా జాతీయ నాయకత్వంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు.ఈ నెల 29వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు.
ఖమ్మంలో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు.అయితే గత నెల 15న ఖమ్మంలో అమిత్ షా సభ జరగాల్సి ఉండగా కొన్ని కారణాల వలన వాయిదా పడిన సంగతి తెలిసిందే.
అమిత్ షా టూర్ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది.ఈ క్రమంలోనే 119 నియోజకవర్గాలకు బీజేపీ ఎమ్మెల్యేలను, ఇంఛార్జ్ లను నియమించాలని నిర్ణయించింది.