డైరెక్టర్ గోపిచంద్ మలినేని( Director Gopichand Malineni ) హీరో రవితేజ కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను,బలుపు,క్రాక్ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.ఇక వీళ్ళ కాంబో లో నాలుగో సినిమా కూడా రావడానికి రెఢీ గా ఉంది.
మైత్రి మూవీ మేకర్స్ ( Mythri Movie Makers )నిర్మిస్తున్న ఈ సినిమా ప్రకటన ఇటీవల వచ్చింది.అయితే ఇప్పుడు ఈ సినిమా కథకి సంబంధించి ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఇది చుండూరు ఊచకోత నేపథ్యంలో రూపొందుతోన్న సినిమా అని ప్రచారం జరుగుతోంది.

1991 ఆగస్టు 6న గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో( Chundur ) కొందరు అగ్రకులస్తులు దళితవాడపై దాడి చేసి దళితులను వెంటాడి, వేటాడి చంపారు.ఆ మారణ కాండలో ఎనిమిది మంది దళితులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.అప్పట్లో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆ ఘటనను ఆధారంగా చేసుకొని ఓ సినిమా రాబోతుందనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రవితేజ, గోపీచంద్( Ravi Teja ) నాలుగో సినిమా ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ మారణ కాండను ప్రతిబింబిస్తోంది.పైగా పోస్టర్ లో చుండూరు బోర్డుతో పాటు, డేంజర్ బోర్డుని చూడవచ్చు.అంటే అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే ఇది చుండూరు హత్యాకాండ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమా అని హింట్ ఇచ్చినట్లు ఉంది.
ఈ హత్యాకాండ వెనుక ప్రస్తుత రాజకీయాల్లో కీలకంగా ఉన్న రెండు అగ్ర కులాలకు చెందివారు ఉన్నారని అంటారు.దీంతో ఈ సినిమా రాజకీయంగా ఎలాంటి దుమారం రేపుతుందోనన్న ఆసక్తి నెలకొంది.
ఇక ఈ సినిమా కూడా వాళ్ల గత సినిమాల మాదిరిగా మంచి సక్సెస్ సాధిస్తుంది అని అటు డైరెక్టర్, ఇటు హీరో ఇద్దరు కూడా మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు…ఇక రీసెంట్ గా డైరెక్టర్ గోపిచంద్ మలినేని బాలయ్య తో వీర సింహ రెడ్డి అనే సినిమా చేసి మంచి హిట్ కొట్టిన విషయం మంచి హిట్ కొట్టిన విషయం మనకు తెలిసిందే…ఇక రవితేజ కూడా ధమాకా లాంటి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు…
.







