నీటిలో ఉండే మొసలి చాలా ప్రమాదకరమైనది.తన వద్దకు వచ్చిన ఏనుగును అయినా అది మట్టికరిపిస్తుంది.
దానికి అంత శక్తి ఉంటుంది.అందులోనూ ఒకటి కంటే ఎక్కువ మొసళ్లు( Crocodiles ) ఉంటే ఇక ప్రాణాలపై ఆశ వదిలేసుకోవాల్సిందే.
అయితే వందల కొద్దీ మొసళ్ల మధ్య చిక్కుకుని ప్రాణాలతో తప్పించుకోవడం అనేది నిజంగా అసాధ్యం.అయితే ఓ కోడి మాత్రం చాలా తెలివిగా వ్యవహరించింది.
ఏ మొసలి నోటికి అందకుండా ఎగురుతూ తప్పించుకుంది.తన ప్రాణం కాపాడుకుని బతుకు జీవుడా అంటూ పరుగులు పెట్టింది.
ఇలాంటి ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో బాగా వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ ప్రపంచంలో చాలా రకాల విషయాలు వైరల్ అవుతున్నాయి.వాటిలో కొన్ని చాలా ఆశ్చర్యకరమైనవి ఉంటాయి.మరికొన్ని మన హృదయాలను గెలుచుకుంటాయి.
జంతువుల విభిన్న శైలి కారణంగా ప్రజలు వాటిని ఇష్టపడుతుంటారు.అడవి జంతువులకు సంబంధించిన వీడియోలను చాలా మంది ఎక్కువగా చూస్తుంటారు.
ఇలాంటి ఓ వీడియో మళ్లీ సోషల్ మీడియా( Social media)లో ప్రత్యక్షమైంది.ఒడ్డున ఓ కోడి నిల్చుని ఉంటుంది.
దానిని చూడగానే ఓ మొసలి నీటి లో నుంచి తినేందుకు వస్తుంది.దాని నుంచి కోడి తప్పించుకుంటుంది.
అయితే చుట్టూ వందల కొద్దీ మొసళ్లు ఉంటాయి.ఆ కోడి ( Chicken )మాత్రం అస్సలు భయపడలేదు.
తనను తినేందుకు నోటిని అమాంతంగా తెరిచి వస్తున్న మొసళ్లను చూసి ఒక్క క్షణం కూడా అది వెనకంజ వేయలేదు.ప్రతి మొసలిని తప్పించుకుంటూ ఎగిరింది.
అలాగే ముందుకు సాగింది.
ఏ ఒక్క మొసలికి అది చిక్కలేదు.చివరికి అలాగే గేటు వద్దకు వెళ్లిపోయింది.ఇలా తెలివిగా వ్యవహరిస్తూ తన ప్రాణాన్ని ఆ కోడి కాపాడుకుంది.
ఈ వీడియోను @BillyM2k అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.దాని తెలివికి నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
ఆ మొసళ్లకు కోడి చుక్కలు చూపించిందని, కోడి తెలివికి తాము ఆశ్చర్యపోయామని, ఆ కోడి ధైర్యానికి హ్యాట్సాఫ్ అని వ్యాఖ్యానిస్తున్నారు.