మొసళ్లకు చుక్కలు చూపించిన కోడి.. అసలు ఏమైందంటే..

నీటిలో ఉండే మొసలి చాలా ప్రమాదకరమైనది.తన వద్దకు వచ్చిన ఏనుగును అయినా అది మట్టికరిపిస్తుంది.

దానికి అంత శక్తి ఉంటుంది.అందులోనూ ఒకటి కంటే ఎక్కువ మొసళ్లు( Crocodiles ) ఉంటే ఇక ప్రాణాలపై ఆశ వదిలేసుకోవాల్సిందే.

అయితే వందల కొద్దీ మొసళ్ల మధ్య చిక్కుకుని ప్రాణాలతో తప్పించుకోవడం అనేది నిజంగా అసాధ్యం.

అయితే ఓ కోడి మాత్రం చాలా తెలివిగా వ్యవహరించింది.ఏ మొసలి నోటికి అందకుండా ఎగురుతూ తప్పించుకుంది.

తన ప్రాణం కాపాడుకుని బతుకు జీవుడా అంటూ పరుగులు పెట్టింది.ఇలాంటి ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో బాగా వైరల్ అవుతోంది.

"""/" / ఇంటర్నెట్ ప్రపంచంలో చాలా రకాల విషయాలు వైరల్ అవుతున్నాయి.వాటిలో కొన్ని చాలా ఆశ్చర్యకరమైనవి ఉంటాయి.

మరికొన్ని మన హృదయాలను గెలుచుకుంటాయి.జంతువుల విభిన్న శైలి కారణంగా ప్రజలు వాటిని ఇష్టపడుతుంటారు.

అడవి జంతువులకు సంబంధించిన వీడియోలను చాలా మంది ఎక్కువగా చూస్తుంటారు.ఇలాంటి ఓ వీడియో మళ్లీ సోషల్ మీడియా( Social Media)లో ప్రత్యక్షమైంది.

ఒడ్డున ఓ కోడి నిల్చుని ఉంటుంది.దానిని చూడగానే ఓ మొసలి నీటి లో నుంచి తినేందుకు వస్తుంది.

దాని నుంచి కోడి తప్పించుకుంటుంది.అయితే చుట్టూ వందల కొద్దీ మొసళ్లు ఉంటాయి.

ఆ కోడి ( Chicken )మాత్రం అస్సలు భయపడలేదు.తనను తినేందుకు నోటిని అమాంతంగా తెరిచి వస్తున్న మొసళ్లను చూసి ఒక్క క్షణం కూడా అది వెనకంజ వేయలేదు.

ప్రతి మొసలిని తప్పించుకుంటూ ఎగిరింది.అలాగే ముందుకు సాగింది.

"""/" / ఏ ఒక్క మొసలికి అది చిక్కలేదు.చివరికి అలాగే గేటు వద్దకు వెళ్లిపోయింది.

ఇలా తెలివిగా వ్యవహరిస్తూ తన ప్రాణాన్ని ఆ కోడి కాపాడుకుంది.ఈ వీడియోను @BillyM2k అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.

దాని తెలివికి నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.ఆ మొసళ్లకు కోడి చుక్కలు చూపించిందని, కోడి తెలివికి తాము ఆశ్చర్యపోయామని, ఆ కోడి ధైర్యానికి హ్యాట్సాఫ్ అని వ్యాఖ్యానిస్తున్నారు.