'లియో' కోసం ధనుష్.. ఈ స్టార్ హీరో ఓకే చెబుతాడా?

ఈ మధ్య స్టార్ హీరోల సినిమాల్లో మరో స్టార్ హీరో భాగం కావడం చూస్తూనే ఉన్నాం.స్టార్ హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్ పాత్రలలో కానీ క్యామియో రోల్స్ కానీ పోషిస్తూ ఆ సినిమాకు హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

 Dhanush In Thalapathy Vijay's Leo, Thalapathy Vijay, Lokesh Kanagaraj , Leo Mo-TeluguStop.com

మేకర్స్ కూడా స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో ఉంటే సినిమాకు ప్లస్ అవుతుంది అని ఆలోచిస్తున్నారు.అందులో ఇప్పుడు అన్ని కూడా పాన్ ఇండియన్ సినిమాలు కావడంతో మేకర్స్ ఈ రకంగా ఆలోచన చేస్తున్నారు.

ఇక కోలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ నడుస్తుంది.అయితే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్ ( Thalapathy Vijay )చేస్తున్న ‘లియో‘( LEO Movie ) సినిమాలో మరో స్టార్ ను నటింపజేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.

మొన్నటి వరకు మన స్టార్ హీరో రామ్ చరణ్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో ఉన్నట్టు టాక్ రాగా ఇప్పుడు ధనుష్ పేరు వినిపిస్తుంది.

Telugu Dhanush, Kollywood, Leo-Movie

ఈ సినిమా ఇప్పటికే భారీ క్యాస్టింగ్ ను యాడ్ చేసుకుంటూ పోతుంది.ఇక తాజాగా ఈ సినిమాలో స్టార్ హేర్ ధనుష్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉందని టాక్ కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది.లియో కోసం డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ధనుష్ ను సంప్రదించాడు అని టాక్.

మరి ఈ హీరో ఓకే చెబుతాడా లేదా చూడాలి.

Telugu Dhanush, Kollywood, Leo-Movie

కాగా భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటి.ఈ సినిమా షూట్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది.ఇక లియో నుండి ఫస్ట్ సింగిల్ ను ఇటీవలే రిలీజ్ చేయగా దీనికి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్( Lalit kumar) భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుందిగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube