ముందస్తు ఎన్నికలకు వెళ్లేదే లేదని ఒకపక్క ఏపీ అధికార పార్టీ వైసిపి ( YCP )ప్రకటనలు చేస్తున్నా, జగన్ పదేపదే ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నా ,టిడిపి, జనసేన, బిజెపిలు మాత్రం ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని బలంగా నమ్ముతున్నాయి.తమ పార్టీ క్యాడర్ కు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇస్తున్నాయి.
ముందస్తు ఎన్నికలు వస్తాయని వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచనలు చేస్తున్నాయి.షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే వచ్చే ఏడాదిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు( AP Assembly Elections ) జరగాల్సి ఉంటుంది.
అయితే ఏపీలోని విపక్ష పార్టీలు మాత్రం అప్పుడే ఎన్నికలు వచ్చేశాయా అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని , సాధారణ ఎన్నికలే జరుగుతాయి అని జగన్ క్లారిటీ ఇస్తున్నా, ఈ విషయంలో జగన్ ( jagan )అబద్ధాలు ఆడుతున్నారని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు.

ఈ ఏడాదిలో ఎప్పుడైనా ఎన్నికలు వస్తాయని పవన్ ఓ బహిరంగ సభలో ప్రకటించారు.దీనికి కారణం లేకపోలేదు.అధికార పార్టీ వైసిపి గతంతో పోలిస్తే మరింత స్పీడ్ పెంచింది.పార్టీ శ్రేణులను ప్రజలకు దగ్గర చేసే ప్రయత్నాలను చేసింది.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై( welfare schemes ) ప్రచారాన్ని ఉదృతం చేసింది.వచ్చే ఎన్నికల్లో ఎక్కడెక్కడ ఎవరిని అభ్యర్థులుగా నిలబెట్టాలనే విషయంలోనూ జగన్ ఒక క్లారిటీకి వస్తున్నారు.
ఈ వ్యవహారాలన్నీ నిశితంగా గమనిస్తున్న విపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికల కోసమే జగన్ ఈ హడావుడి చేస్తున్నారని బలంగా నమ్ముతున్నాయి.

దీంతో తమ పార్టీ బలం, బలహీనతలు, అలాగే నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితి , ఎవరిని అభ్యర్థులుగా దించితే విజయం దక్కుతుంది ఇలా అనేక అంశాలపై సర్వేలు చేస్తున్నాయి.ఇక కొన్ని సర్వే సంస్థలు ఇప్పటికే రంగంలోకి దిగి పలానా పార్టీ ఏపీలో గెలవబోతుందనే ప్రకటన కూడా చేశాయి.ఏ పార్టీకి ఆ పార్టీ తామే గెలవబోతున్నామని, తమకు అనుకూలంగా వచ్చిన సర్వే ఫలితాలను నిదర్శనంగా చూపిస్తూ ప్రచారం చేసుకుంటున్నాయి.
ఈ తరహా వాతావరణం ఏపీలో నెలకొనడంతో ఏపీలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైపోయినట్టుగానే పరిస్థితి కనిపిస్తోంది.







