కూతురు కోసం మెగాస్టార్ వరుసగా రెండు..!

మెగాస్టార్‌ చిరంజీవి ( Megastar Chiranjeevi ) వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు.గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు ఈ ఏడాది ఇప్పటికే వాల్తేరు వీరయ్య ( Waltheru Veeraya ) సినిమా తో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

 Chiranjeevi Next New Two Films Under Susmita Konidela Productions , Megastar Chi-TeluguStop.com

ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇదే ఏడాది ఆగస్టు లో భోళా శంకర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు

Telugu Bhola Shankar, Bro Daddy, Chiranjeevi, Meher Ramesh, Telugu, Tollywood, T

.మెహర్‌ రమేష్ ( Meher Ramesh ) దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.ఆ తర్వాత చిరంజీవి చేయబోతున్న రెండు సినిమా లు దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యాయి.

ఆ రెండు సినిమా లు కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.మరో ఇంట్రెస్టింగ్‌ విషయం ఏంటి అంటే ఆ రెండు సినిమా లను కూడా మెగా స్టార్‌ చిరంజీవి కూతురు అయిన సుస్మిత కొణిదెల ( Sushmita Konidela ) నిర్మించబోతున్నారు.

ఇప్పటికే సుస్మిత వెబ్ సిరీస్ ను నిర్మించిన అనుభవం దక్కించుకున్నారు.కనుక మెగాస్టార్‌ చిరంజీవి తన కూతురుకు రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి పెట్టేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

Telugu Bhola Shankar, Bro Daddy, Chiranjeevi, Meher Ramesh, Telugu, Tollywood, T

అందులో ఒకటి మలయాళం హిట్ మూవీ బ్రో డాడీ ( bro daddy ) కి రీమేక్.సోగ్గాడే చిన్ని నాయన ఫేం కళ్యాణ్‌ కృష్ణ రీమేక్ కు దర్శకత్వం వహించబోతున్నాడు.ఆ తర్వాత బింబిసార దర్శకుడు వశిష్ఠ్‌ కి కూడా మెగాస్టార్ చిరంజీవి ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఈ రెండు సినిమా లను కూడా సుస్మిత నిర్మించనున్న నేపథ్యం లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కూతురు కోసం భారీ ప్రాజెక్ట్‌ లు రెండు చేస్తున్నాడు.అందులో ఒకటి కాకున్నా ఒకటి విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా ఈజీగా కూతురుకు లాభాల పంట పండటం ఖాయం.

చిరు ఎలాగూ పారితోషికం తీసుకోడు కనుక పాతిక నుండి ముప్పై కోట్ల మేకింగ్ ఖర్చుతో సినిమా పూర్తి అవుతుంది.కనుక ఏ స్థాయి లో సుస్మిత కి లాభాల పంట పండేనో అర్థం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube