మారుతి ఇన్విక్టో టీజర్ విడుదల.. ఫీచర్లు చూస్తే మతి పోవాల్సిందే..!

మారుతీ సుజుకి కంపెనీ( Maruti Suzuki Company ) తన కొత్త మారుతీ ఇన్విక్టో( Maruti Invicto ) కారును భారత మార్కెట్లో జులై ఐదున విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది.అయితే ఈ కారుకు సంబంధించిన 20 సెకండ్ల టీజర్ వీడియోను కంపెనీ విడుదల చేసింది.

 Maruti Invicto Teaser Released , Maruti Invicto , Maruti Suzuki Company, Maruti-TeluguStop.com

మారుతీ సుజుకి కంపెనీ అంటే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అని అందరికీ తెలిసిందే.దశాబ్దాల కాలం నుండి భారతీయ మార్కెట్ ను ఈ కార్ల కంపెనీ శాసిస్తోంది.

ఈ కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి కార్లను విడుదల చేస్తూనే ఉంది.ఈ క్రమంలోనే మారుతీ నుంచి కొత్తగా ఇన్విక్టో కారు సరికొత్త ఫీచర్లతో మార్కెట్లో అడుగుపెట్టనుంది.

Telugu Latest Telugu, Marutimpv-Technology Telugu

ఈ కారు ఫీచర్ల విషయానికి వస్తే.ఈ కొత్త మారుతి MPV ఇన్నోవా హైక్రాస్( Maruti MPV Innova Hicross ) ఆధారంగా రూపొందించబడింది.కారు వెనుక భాగంలో ఇన్విక్టో బ్యాడ్జింగ్ తో పాటు LED ల్యాంప్ ఇన్స్టాల్ అయి ఉంది.ఈ కొత్త కారు యొక్క బంపర్ టయోటా కారుతో పోలిస్తే కాస్త భిన్నంగా కనిపిస్తోంది.

అల్లాయ్ వీల్స్, టెయిల్ గెట్ సుజుకి లోకోను కలిగి ఉంటాయి.ఈ కారు మోనోకోక్ ఛాసిస్ ను కలిగి ఉంటుంది.ఈ ఇన్విక్టో కారు 2.0 లీటర్,4 సిలిండర్ అట్కిన్సన్ సైకిల్ స్ట్రాంగ్ హైబ్రిడ్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులోకి రానుంది.ఇక ఈ కారు యొక్క ప్లాట్ ఫారం, కొలతలు, ఫీచర్లు, పవర్ ట్రెయిన్లు టయోటా ఇన్నోవా హైక్రాస్ ని పోలి ఉంటాయి.

ఈ కారు ముందు భాగంలో కూడా ఎన్నో మార్పులతో రానుంది.

Telugu Latest Telugu, Marutimpv-Technology Telugu

ఇక ఈ కారు మైలేజ్ గురించి చర్చించుకుంటే హైబ్రిడ్ పవర్ ట్రెయిన్తో 23.4 kmpl, పెట్రోల్ యూనిట్ తో 16.13 kmpl మైలేజీని అందిస్తుంది.కారు ఇంటీరియర్ డిజైన్ విషయానికొస్తే ఇన్విక్టో ఎమ్పివి 7, 8-సీట్ల కాన్ఫిగరేషన్ లతో వస్తుంది.అంతేకాకుండా మారుతీ ఇన్విక్టో కారులో పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 9-స్పీకర్ JBL సౌండ్ సిస్టం, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, హిల్ హోల్డ్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ లతో వస్తుంది.

ఈ కారు ఫ్లాగ్ షిప్ మోడల్ కావడంతో అధునాతన కంఫర్ట్ బటన్లు మరియు భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది.ఈ కారు మార్కెట్లోకి వచ్చాక అందరిని ఆకర్షించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube