మారుతి ఇన్విక్టో టీజర్ విడుదల.. ఫీచర్లు చూస్తే మతి పోవాల్సిందే..!

మారుతీ సుజుకి కంపెనీ( Maruti Suzuki Company ) తన కొత్త మారుతీ ఇన్విక్టో( Maruti Invicto ) కారును భారత మార్కెట్లో జులై ఐదున విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది.

అయితే ఈ కారుకు సంబంధించిన 20 సెకండ్ల టీజర్ వీడియోను కంపెనీ విడుదల చేసింది.

మారుతీ సుజుకి కంపెనీ అంటే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అని అందరికీ తెలిసిందే.

దశాబ్దాల కాలం నుండి భారతీయ మార్కెట్ ను ఈ కార్ల కంపెనీ శాసిస్తోంది.

ఈ కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి కార్లను విడుదల చేస్తూనే ఉంది.

ఈ క్రమంలోనే మారుతీ నుంచి కొత్తగా ఇన్విక్టో కారు సరికొత్త ఫీచర్లతో మార్కెట్లో అడుగుపెట్టనుంది.

"""/" / ఈ కారు ఫీచర్ల విషయానికి వస్తే.ఈ కొత్త మారుతి MPV ఇన్నోవా హైక్రాస్( Maruti MPV Innova Hicross ) ఆధారంగా రూపొందించబడింది.

కారు వెనుక భాగంలో ఇన్విక్టో బ్యాడ్జింగ్ తో పాటు LED ల్యాంప్ ఇన్స్టాల్ అయి ఉంది.

ఈ కొత్త కారు యొక్క బంపర్ టయోటా కారుతో పోలిస్తే కాస్త భిన్నంగా కనిపిస్తోంది.

అల్లాయ్ వీల్స్, టెయిల్ గెట్ సుజుకి లోకోను కలిగి ఉంటాయి.ఈ కారు మోనోకోక్ ఛాసిస్ ను కలిగి ఉంటుంది.

ఈ ఇన్విక్టో కారు 2.0 లీటర్,4 సిలిండర్ అట్కిన్సన్ సైకిల్ స్ట్రాంగ్ హైబ్రిడ్, 2.

0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులోకి రానుంది.ఇక ఈ కారు యొక్క ప్లాట్ ఫారం, కొలతలు, ఫీచర్లు, పవర్ ట్రెయిన్లు టయోటా ఇన్నోవా హైక్రాస్ ని పోలి ఉంటాయి.

ఈ కారు ముందు భాగంలో కూడా ఎన్నో మార్పులతో రానుంది. """/" / ఇక ఈ కారు మైలేజ్ గురించి చర్చించుకుంటే హైబ్రిడ్ పవర్ ట్రెయిన్తో 23.

4 Kmpl, పెట్రోల్ యూనిట్ తో 16.13 Kmpl మైలేజీని అందిస్తుంది.

కారు ఇంటీరియర్ డిజైన్ విషయానికొస్తే ఇన్విక్టో ఎమ్పివి 7, 8-సీట్ల కాన్ఫిగరేషన్ లతో వస్తుంది.

అంతేకాకుండా మారుతీ ఇన్విక్టో కారులో పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 9-స్పీకర్ JBL సౌండ్ సిస్టం, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, హిల్ హోల్డ్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ లతో వస్తుంది.

ఈ కారు ఫ్లాగ్ షిప్ మోడల్ కావడంతో అధునాతన కంఫర్ట్ బటన్లు మరియు భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది.

ఈ కారు మార్కెట్లోకి వచ్చాక అందరిని ఆకర్షించే అవకాశం ఉంది.

ఏపీ యువతికి సహాయం చేసి మాట నిలబెట్టుకున్న సోనూసూద్.. ఈ రియల్ హీరోకు సాటిరారుగా!