నోయిడాలోని( Noida ) ఓ మాల్‌లోని ఓ రెస్టారెంట్‌లో రూ.970 సర్వీస్ ఛార్జీ విషయమై కస్టమర్లు, సిబ్బంది మధ్య కొట్లాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టింది.వీడియో చూసిన తరువాత నెటిజన్లు రెస్టారెంట్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.వినియోగదారుల వ్యవహారాల శాఖ( Consumer Affairs Department ) సైతం దీనిపై చాలా సీరియస్ అయ్యింది.అంతేకాదు, నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) అధ్యక్షుడు కబీర్ సూరికి, ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FHRAI) అధ్యక్షుడు సురేష్ పొద్దార్‌లకు లేఖ పంపింది.
సర్వీస్ ఛార్జీని( Service Charge ) కట్టాలా, వద్దా అనేది పూర్తిగా కస్టమర్ల ఇష్టం పైనే ఆధారపడి ఉంటుందని ఈ లేఖ ద్వారా స్పష్టం చేసింది.కస్టమర్లు సర్వీస్‌తో సంతోషంగా లేనప్పుడు దానిని చెల్లించమని రెస్టారెంట్ సిబ్బంది బలవంతం చేయరాదని లేఖలో పేర్కొంది.సర్వీస్ ఛార్జ్‌ను తప్పనిసరి చేయవద్దని రెస్టారెంట్ అసోసియేషన్లు తమ సభ్యులకు చెప్పాలని కూడా కోరింది.కస్టమర్లు సేవతో సంతృప్తి చెందితే వారి నుంచి సర్వీస్ ఛార్జీని ఒక టిప్పుగా మాత్రమే రెస్టారెంట్ యజమానులు తీసుకోవాలని లేఖలో తెలిపింది.
కన్జ్యూమర్ అఫైర్స్ పంపిన లేఖను తాము గమనించామని NRAI ప్రెసిడెంట్ కబీర్ సూరి తెలిపారు.ఆయన మాట్లాడుతూ, సర్వీస్ ఛార్జీని సాధారణంగా అందరు సిబ్బంది సరి సమానంగా పంచుకుంటారని అన్నారు.ఈ ఛార్జీని రైల్వేలు, విమానాశ్రయాలు, టాక్సీల వంటి ప్రదేశాలలో చెల్లించే కన్వీనియన్స్ ఫీజుతో పోల్చారు.ఇదిలా ఉండగా సర్వీస్ ఛార్జీల మార్గదర్శకాలపై కోర్టులో కేసు నడుస్తోంది.హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లుకు ఆటోమేటిక్‌గా సర్వీస్ ఛార్జీలను జోడించకూడదని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ తీసుకొచ్చిన నిబంధనలను గత సంవత్సరం కోర్టు నిలిపివేసింది.