అభిమానులే అడ్డుగోడగా మారుతున్నారా ?

తూర్పుగోదావరి జిల్లాలో వరాహి పేరుతో హల్చల్ చేస్తున్న పవన్ కళ్యాణ్( pawan kalyan ) అక్కడ స్థానిక నేతలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో కొన్ని సున్నితమైన భావాలను పంచుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.వైసిపి రహిత గోదావరి జిల్లాలను తీసుకురావాలని, ఉభయగోదావరి జిల్లాలో ఉన్న 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా వైసిపికి ( YCP )దక్కకుండా వ్యూహరచన చేయాలని ఆయన స్థానిక నేతలను కోరినట్లుగా తెలుస్తుంది .

 Pavan Unable To Meet People Due Fans Over Affection , Pawan Kalyan, 2024 Electio-TeluguStop.com

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో బలంగా నిలదీసే విధంగా ముందుకు వెళ్లాలని ఆయన స్థానిక నేతలను కోరారట.తనకు బలంగా ప్రజల్లోకి వెళ్లాలని ఉంటుందని కాకపోతే తనని అభిమానించే కార్యకర్తలు అభిమానులు అడ్డుగోడగా నిలబడుతున్నారు అని కూడా ఆయన వాపోయారట.

Telugu Pawan Kalyan, Ys Jagan-Telugu Political News

ప్రజలను ప్రత్యక్షంగా కలవాలని తాను బలం గా కోరుకుంటున్నపటికి సినీ అభిమానం కారణంగా అది నెరవేరడం లేదని ప్రతిచోట అభిమానులు వేల సంఖ్యలో అడ్డుపడటం వల్ల సామాన్య ప్రజలను కలిసి అవకాశం కూడా తనకు ఉండటం లేదని, అందువల్లే పాదయాత్ర లాంటివి జనసేన చేయలేకపోతుందని కూడా ఆయన అభిప్రాయపడినట్లుగా తెలుస్తుంది.అయితే అభిమానుల ప్రేమను అర్థం చేసుకోగలనని కాకినాడ ఎమ్మెల్యే(Dwarampudi Chandrasekhar Reddy ) తన అభిమానులు పై చేసిన దౌర్జన్యాలను జీవితంలో మర్చిపోను ,అని అంతకు అంతా ప్రతీకారం తీర్చుకునే రోజులు వస్తాయని అబిమానులకు జరిగిన అవమానాల్ని పార్టీ తరఫున గట్టిగా అప్పుడు తిప్పి కొట్టలేకపోయామని అయితే ప్రతిదానికి ఒక సమయం వస్తుందని సమయం వచ్చినప్పుడు జనసేన పవర్ చూపిద్దామంటూ ఆయన కార్యకర్తలతో చెప్పినట్లు సమాచారం.

Telugu Pawan Kalyan, Ys Jagan-Telugu Political News

పిఠాపురంలో తాను ఇల్లు కూడా తీసుకుంటానని వచ్చే ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నట్టుగా పవన్ వ్యాఖ్యానించారట.దాంతో పవన అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయినట్లుగా తెలుస్తుంది.ఏది ఏమైనా ప్రజల బాధలను తెలుసుకోవాలన్న తన ఆకాంక్షలకు అభిమానులు అడ్డుగా ఉంటున్నారు అన్న విషయాన్ని మాత్రం జనసైనికులు అర్థం చేసుకోవాలని పార్టీ నాయకులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube