టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో సాగుతున్న సంగతి తెలిసిందే.మొన్నటిదాకా రాయలసీమ ప్రాంతంలో జరిగిన పాదయాత్రకి భారీ ఎత్తున ప్రజలు హాజరు కావడం జరిగింది.
ఈ క్రమంలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకమైన మేనిఫెస్టో.మిషన్ రాయలసీమ పేరిట విడుదల చేస్తామని.
లోకేష్ హామీ కూడా ఇవ్వడం జరిగింది.ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా కల్లూరులో నేడు జరుగుతున్న పాదయాత్రలో గిరిజనులతో లోకేష్ సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్టీ కాలనీలలో సీసీ రోడ్లు వేయిస్తామని స్పష్టం చేశారు.ఎస్టీ లందరికీ ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.మూడు సంవత్సరాలలో మంచినీటి కుళాయిలు.కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని స్పష్టం చేయడం జరిగింది.ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.వైసీపీ ప్రభుత్వం గిరిజనులను మర్చిపోయిందని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా గిరిజనుల కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని లోకేష్ ఆరోపణలు చేయడం జరిగింది.