సింగిల్‌ స్క్రీన్స్ అన్నీ మల్టీప్లెక్స్ లు అయితే పరిస్థితి ఏంటి?

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా సినిమా థియేటర్ల వ్యవస్థ అనేది అత్యంత ప్రమాదంలో పడిపోయింది.సినిమా థియేటర్ల కు జనాలు వచ్చే పరిస్థితి ముందు ముందు మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.

 Bad Days For Single Screen Theatres , Single Screen Theatres , Multiplex , Sud-TeluguStop.com

దేశం లో కరోనా తర్వాత చాలా థియేటర్లు మూత పడ్డాయి.ముఖ్యంగా ఉత్తర భారతంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ( Single screen theaters )చాలా మూత పడ్డాయి.

అంతే కాకుండా ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్‌ సంస్థ తన 150 స్క్రీన్స్ ను కూడా మూసి వేసేందుకు సిద్ధం అయ్యిందనే పుకార్లు ఆ మధ్య వచ్చాయి.అది నిజం కాదని కొందరు అన్నారు.

ఆ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Telugu Aaa Multiplex, Asian Cinemas, Multiplex, Screen, Tollywood-Movie

ఒక వైపు సింగిల్ స్క్రీన్‌ థియేటర్లకు కష్టకాలం నడుస్తూ ఉంటే మరో వైపు మల్టీ ప్లెక్స్ థియేటర్ లు వరుసగా వస్తున్నాయి.ఏషియన్ సినిమాస్( Asian Cinemas ) వారు పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ ల నిర్మాణం చేపట్టారు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్‌ థియేటర్ ( Sudarshan Theatre )ప్లేస్ లో ఏషియన్స్ వారి మల్టీ ప్లెక్స్ రాబోతుందట.

దాన్ని తొలగించేందుకు సిద్ధం అవుతున్నట్లుగా స్వయంగా ఏషియన్ సినిమాస్ అధినేత ప్రకటించారు.

Telugu Aaa Multiplex, Asian Cinemas, Multiplex, Screen, Tollywood-Movie

ఈ నేపథ్యం లో ముందు ముందు తెలుగు రాష్ట్రాల్లో సింగ్ స్క్రీన్ థియేటర్లు అనేవి కనిపించవేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల గురించి సినీ ప్రేమికులు మాట్లాడుకుంటూ తమ అనుభవాలను నెమరవేసుకుంటున్నారు.ఎన్నో రకాలుగా సింగిల్ స్క్రీన్‌ థియేటర్లు ఇండియన్ సినిమాను ముందుకు తీసుకు వెళ్లాయి.

కానీ మల్టీప్లెక్స్ లు వస్తే సామాన్యులకు సినిమా దూరం అవుతుందని అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మల్టీ ప్లెక్స్ ల కంటే సింగిల్ స్క్రీన్ ల ద్వారా నే ఎక్కువ ఆదాయం వస్తుంది.

కానీ మెయింటెన్స్ ఎక్కువ అవుతుందని నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube