బిపర్ జోయ్ ఎఫెక్ట్.. అల్లకల్లోలంగా గుజరాత్ సముద్రతీరం

బిపర్ జోయ్ తుఫానుతో గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.ఈదురుగాలులతో పాటు ద్వారక వద్ద సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.

 Bipar Joy Effect.. Turbulent Gujarat Seashore-TeluguStop.com

తుఫాను నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు గుజరాత్ తీర ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.అదేవిధంగా సముద్ర తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

కాగా బిపర్ జోయ్ అతి తీవ్ర తుఫాను నుంచి తీవ్ర తుఫానుగా బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.జఖౌ పోర్టు దగ్గర ఎల్లుండి మధ్యాహ్నం బిపర్ జోయ్ తీరాన్ని తాకనుందని అంచనా వేస్తున్నారు.

తీరం దాటే సమయంలో 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube