తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
ఈ క్రమంలోనే ముందుగా సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.అదేవిధంగా ఎస్పీ కార్యాలయంలో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.
అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.