రసకందాయంలో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం!!

ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయ( Telangana politics ) ముఖచిత్రం మారుతుంది.నిన్నటి వరకు మిత్రులుగా మారతారు అనుకున్న వారు ఇప్పుడు కలహించుకుంటున్నారు, బద్ధ శత్రువులు అనుకున్న వారు దగ్గరకు చేరి కొత్త చర్చలు చేస్తున్నారు, ఏది ఏమైనా తెలంగాణ రాజకీయ వైకుంఠపాళీ లో పావులు అతివేగంగా కదులుతున్న సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి .

 Huge Changes In Telangana Political Scenario , Telangana Political, Karnataka El-TeluguStop.com

నిన్నటి వరకు భాజపా పేరు చెబితేనే మండిపడ్డ కేసీఆర్ వర్గం ఇప్పుడు కాంగ్రెస్ పై కారాలు మిరియాలు నూరుతుంది .ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్( Chief Minister KCR ) సిద్దిపేట సభలో చేసిన వ్యాఖ్యలు మారిన రాజకీయ సమీకరణాలనుదృవపరుస్తున్నాయి .మరోపక్క భాజపా కీలక నేత అమిత్ షా మరియు జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చంద్రబాబు( Chandrababu ) చర్చలు కూడా సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నాయి.

Telugu Chandrababu, Karnataka, Sharmila, Telangana-Telugu Political News

2018లో విడిపోయిన తర్వాత నుంచి శత్రువులుగా వ్యవహరిస్తున్న ఈ రెండు పార్టీల్లో ఇప్పుడు ఈ చర్చలు కొత్త స్నేహానికి నాంది పలుకుతున్నాయని వార్తలు వస్తున్నాయి .అయితే దీనికి తెలంగాణ బిజెపి( BJP ) నేతల వెర్షన్ మరో రకంగా ఉంది.చంద్రబాబు నడ్డాల కలయిక తెలంగాణ గురించి కాదని వేరే ప్రయోజనాల కోసం అంటూ తెలంగాణ కాషాయనేతలు చెప్పుకొస్తున్నారు.

మరొక పక్కతెలంగాణలో ఎన్నికలు పూర్తయిన తర్వాత భాజపా ఉనికి తెలంగాణలో నుంచి మాయం అవుతుంది అంటూ రాహుల్ గాంధీ ప్రకటించారు.షర్మిల( Sharmila ) పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రణరంగం లో ఒక దిగాలని కాంగ్రెస్ భావిస్తుందంటూ మరోపక్క వార్తలు వస్తున్నాయి .తెలంగాణ బాజాపా లో ఐక్య పోరాట స్పూర్తి లోపించడం తో బారసా Vs బాజాపా పోటీ కాస్త ఇప్పుడు కాంగ్రెస్ vs బారాసాగా మారిపోయింది.

Telugu Chandrababu, Karnataka, Sharmila, Telangana-Telugu Political News

కర్ణాటక ఎన్నికల ( Karnataka Elections )ఫలితాల తర్వాత తెలంగాణ భాజపా నాయకులు డీలా పడినట్లుగా తెలుస్తుంది.అంతేకాకుండా కీలక నాయకులను పార్టీలోకి చేర్చాలనుకున్న ప్రయత్నాలు కూడా వీగిపోవడంతో తెలంగాణ బాజాపా లో ఒక రకమైన నిరాసక్తత కనిపిస్తుంది.దాంతో వచ్చే ఎన్నికలు ప్రధానంగా భారతీయ రాష్ట్ర సమితికి కాంగ్రెస్కు మధ్యలో ఉండబోతున్నాయని సంకేతాలు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉన్న టిడిపి తో కలిసి వెళ్తే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని ఆలోచనతోనే చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపినట్లుగా సమాచారం .అయితే చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే ఆంధ్ర ముద్ర పడుతుందని ఆ వ్యతిరేకతతో కేసీఆర్ మరొకసారి ఈజీగా గట్టెక్కేస్తారని భయం తెలంగాణ బాజాపా నేతలలో ఉన్నట్లుగా తెలుస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube