అధికారంలో కూర్చున్న కొన్ని నెలల్లోనే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy )ప్రభుత్వ పథకాలు అన్నిటికీ వారినే రథసారదులుగా ఉపయోగించుకుంటున్నారు.తెల్లారి లేస్తే ప్రభుత్వంతో ప్రజలకు అవసరమైన ప్రతి పని వాలంటీర్ల చేతుల మీద గానే పూర్తవుతుంది.
దాంతో ప్రజలకి వాలంటీర్లకు మధ్య ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది.దాంతో ఈ వ్యవస్థను మరింత సమర్దవంతం గా ఉపయోగించుకుని వచ్చే ఎన్నికలకు వీరిని ఒక సాదానం గా ఉపయోగించుకునే ఉద్దేశం లో అదికార పార్టీ పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తుంది .ఇటీవల జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమా లలో బాగం గా వివిద వేదికలపై ముఖ్యమంత్రి వాలంటీర్ల ను ఉద్దేశించి చేసిన వాఖ్యలను ఇందులో బాగం గానే చూడాలి .మీరే నా సైన్యం .రాజకీయంగా మిమ్మల్ని ఆపేదెవరు? వాలంటీర్లను నాయకులుగా తయారు చేస్తాను లాంటి వ్యాఖ్యలు వాలంటీర్లను తనకు అనుకూలంగా పని చేయించుకోవడానికి వారిని సిద్ధం చేస్తున్నట్లుగానే చూడాలి వస్తుంది .

ఒక పార్టీకి రాజకీయ కార్యకర్తలు ఎలా ఉపయోగపడతారో అంతకు పదిరెట్లు వాలంటీర్ వ్యవస్థ(volunteers ) జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడుతుంది అన్న విశ్లేషణ రాజకీయ విశ్లేషకులు కూడా చేస్తున్నారు .ప్రజలు కందిన ప్రతి మంచి తాలూకు క్రెడిట్ ని జగన్ మోహన్ రెడ్డి పడే ఖాతాలో పడేలా చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.దాంతో వచ్చే ఎన్నికలలో వీళ్ళనే నమ్ముకొని ముందుకు వెళ్లాలని ఆలోచన జగన్ లో ఉన్నారని ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ద్వారా మనకు అర్థమవుతుంది .అంతేకాక ఆంధ్రప్రదేశ్లో జరిగిన అనేక ఉప ఎన్నికలలో వాలంటీర్ వ్యవస్థ అధికార పార్టీ కి అనుకూలం గా పని చేయడం వల్లే వల్లే ఓడిపోయామన్న భావన టిడిపి నేతల్లో ఉంది .మహానాడు వేదికగా ఈ దిశగా చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు.వాలంటీర్ వ్యవస్థకు సమాంతరంగా తెలుగుదేశం( TDP ) కార్యకర్తల వ్యవస్థ పని చేయాల్సిన అవసరం ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు.

తద్వారా వచ్చేఎన్నికల పోరు తెలుగు దేశం కార్యకర్తలకు వాలంటీర్లకు మధ్య ఉంటుందని తేలిపోయింది ….వాలంటీర్లు వ్యవహార శైలిపై ఇప్పటికే ప్రతిపక్షాలు అనేకసార్లు న్యాయస్థానాల తలుపు తట్టినప్పటికీ వారికి పూర్తిస్థాయి ఊరట అయితే దక్కలేదు.వచ్చే ఎన్నికలలో వాలంటీర్ వ్యవస్థను ఏ రకం గా నియంత్రిస్తారు అన్నదానిపైనే ప్రతిపక్షాల విజయం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.