తెలుగు ప్రేక్షకులకు నటి షకీలా ( Shakeela )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ఎక్కువ శాతం ఈమె సినిమాలలో అలాంటి పాత్రలోని నటించింది.ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించింది షకీలా.
చాలామందికి షకీలా పేరు వినగానే జయం ( Jayam movie )సినిమాలో కమెడియన్ సునీల్ శెట్టి కి ఆమె ఇచ్చిన వార్నింగ్ సన్నివేశమే గుర్తుకు వస్తూ ఉంటుంది.ఇకపోతే టాలీవుడ్ డైరెక్టర్ తేజ ( Director Teja )షకీలాకు ఎలా అవకాశం ఇచ్చాడు అన్న విషయాన్ని తాజాగా ఆయన అహింస సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ.నేను ఆర్ పి పట్నాయక్ మరొక వ్యక్తి ముగ్గురం కలిసి హైదరాబాదులోని ఒక థియేటర్ వైపు వెళ్తున్నాము.అప్పుడు కుర్రాళ్ళు టికెట్ కౌంటర్ దగ్గర కొట్టుకుంటున్నారు.గుంపులు గుంపులుగా వస్తుంటే ఏంటా అని వెళ్ళాము.అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ కామేశ్వరి అనే సినిమా ఆడుతుంది.ఇక నేను మేనేజర్ ను అడిగి మూడు టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాం.
లోపలికి వెళ్తున్న సమయంలో మేనేజర్ మమ్మల్ని చూసి వీళ్ళు కూడా ఈ సినిమాలు చూస్తారా అంటూ నోట్లో ఏదో గొనిగాడు.మేము లోపలికి వెళ్ళగానే కుర్రాళ్ళు హారతి పళ్లాలతో నిలబడి ఉన్నారు.
షకీలా తెరపైకి రాగానే హారతి ఇవ్వడం మొదలుపెట్టారు.
అది చూసి నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను.ఆ సమయంలో జయం సినిమాలో లెక్చరర్ పాత్రకు ఆమెను నేను ఫిక్స్ అయ్యాను అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ తేజ.ఇకపోతే డైరెక్టర్ తేజ తాజాగా దర్శకత్వం వహించిన అహింస సినిమా విషయానికి వస్తే.ఇందులో అభిరాం దగ్గుపాటి హీరోగా నటించిన విషయం తెలిసిందే.గీతికా తివారి హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా జూన్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది.